For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Seetimaarr 5 Days collections: భారీగా పడిపోయిన కలెక్షన్స్.. హిట్ అవ్వాలంటే అంత రావాల్సిందే

    |

    'లౌక్యం' వచ్చి చాలా కాలమే అవుతోన్నా.. అప్పటి నుంచి విజయం కోసం పరితపిస్తూ వచ్చాడు మాచో హీరో గోపీచంద్. హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో సినిమాలను వరుస పెట్టి చేశాడు. కానీ, అతడిని మాత్రం సక్సెస్ వరించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ టాలెంటెడ్ హీరో 'సీటీమార్' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలు, ఆశల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చాయి. ఫలితంగా వీకెండ్‌ను గ్రాండ్‌గా ముగించింది. అయితే, వీక్ డేస్‌లో మాత్రం 'సీటీమార్'కు కష్టాలు తప్పట్లేదు. మరి ఈ మూవీ 5 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

     ‘సీటీమార్' అంటూ వచ్చిన గోపీచంద్

    ‘సీటీమార్' అంటూ వచ్చిన గోపీచంద్

    గోపీచంద్ - సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం ‘సీటీమార్'. తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి దీన్ని నిర్మించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భూమిక చావ్లా ఇందులో కీలక పాత్రను పోషించింది. అప్సరా రాణి స్పెషల్ సాంగ్‌ను చేసింది. మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.

    బాత్రూంలో బ్రాతో సమంత రచ్చ: అందాలన్నీ చూపిస్తూ మరీ ఘాటుగా.. ఫస్ట్ టైమ్ ఈ రేంజ్‌లో!

    సినిమా బిజినెస్ ఎక్కడ ఎంత జరిగింది?

    సినిమా బిజినెస్ ఎక్కడ ఎంత జరిగింది?

    మిగిలిన హీరోలతో పోలిస్తే గోపీచంద్‌కు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ కొంచెం తక్కువనే చెప్పాలి. అయితే, ‘సీటీమార్' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో రూ. 5 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ. 11.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    ఐదో రోజు ఎక్కడ.. ఎంత వచ్చిందంటే?

    ఐదో రోజు ఎక్కడ.. ఎంత వచ్చిందంటే?

    ‘సీటీమార్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు భారీ షాక్ తగిలింది. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్‌లో రూ. 6 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 51 లక్షలు షేర్, రూ. 86 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

    తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్: ఆమె ప్రెగ్నెంట్ అనడానికి ఇదే సాక్ష్యం.. అలా కనిపించడంతో!

    ఐదు రోజులకు కలిపి ఎంత రాబట్టింది?

    ఐదు రోజులకు కలిపి ఎంత రాబట్టింది?

    వీకెండ్‌లో బాగా రాణించిన ‘సీటీమార్' మూవీ ఐదు రోజులకు కలిపి నైజాంలో రూ. 2.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.48 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 96 లక్షలు, ఈస్ట్‌లో రూ. 77 లక్షలు, వెస్ట్‌లో రూ. 43 లక్షలు, గుంటూరులో రూ. 89 లక్షలు, కృష్ణాలో రూ. 44 లక్షలు, నెల్లూరులో రూ. 39 లక్షలతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.46 కోట్లు షేర్, రూ. 12.21 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

    భారీగా పడిన గోపీచంద్ సినిమా వసూళ్లు

    భారీగా పడిన గోపీచంద్ సినిమా వసూళ్లు

    భారీ అంచనాల నడుమ విడుదలైన ‘సీటీమార్' చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడు రోజులకు ఈ చిత్రం భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. కానీ సోమవారం నుంచి పరిస్థితి తారుమారు అయింది. ఇక, మంగళవారానికి దీనికి చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. ఇదే కొనసాగితే సినిమా హిట్ స్టేటస్‌ను అందుకోవడం కష్టంగా మారుతుంది.

    Bigg Boss: షోలో సంచలన సంఘటన.. సిరి టీషర్ట్‌లో చేయి పెట్టిన కంటెస్టెంట్.. అందరి ముందే బలవంతంగా!

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వసూళ్లు ఎంత

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వసూళ్లు ఎంత

    తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల్లో రూ. 7.46 కోట్లు షేర్ రాబట్టిన గోపీచంద్ ‘సీటీమార్' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 29 లక్షలు, ఓవర్సీస్‌లో (అమెరికాలో ప్రదర్శించలేదు) రూ. 8 లక్షలు వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల్లో ఈ చిత్రం రూ. 7.83 కోట్లు షేర్, రూ. 13 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చేరువ అయింది.

    మూవీ టార్గెట్ ఎంత? ఇంక ఎంతొస్తే హిట్?

    మూవీ టార్గెట్ ఎంత? ఇంక ఎంతొస్తే హిట్?

    ‘సీటీమార్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ జరుపుకుంది. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి (అమెరికాలో లేదు) రూ. 11.50 కోట్లు మేర వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ. 12 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ చిత్రం ఐదు రోజుల్లో రూ. 7.83 కోట్లు వసూలు చేసింది. దీంతో మరో రూ. 4.14 కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

    English summary
    Tollywood Talented Hero Gopichand and Sampath Nandi Seetimaarr Movie Released Last Friday. This Movie Collect 7.83 Cr in 5 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X