Seetimaarr 9 Days collections: దారుణంగా సీటీమార్ కలెక్షన్స్.. హిట్‌కు అన్ని కోట్ల దూరంలో!

కావాల్సినంత టాలెంట్ ఉన్నా.. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడం సహా పలు కారణాలతో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాడు మాచో హీరో గోపీచంద్. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలతో దూకుడు చూపించిన అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం అంతగా విజయాలను అందుకోలేకపోతున్నాడు. దీంతో వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవలే 'సీటీమార్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం ఆశించిన రీతిలో రావట్లేదు. ఇక, ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

‘సీటీమార్' కొట్టాలని వచ్చిన గోపీచంద్

‘సీటీమార్' కొట్టాలని వచ్చిన గోపీచంద్

గోపీచంద్.. సంపత్ నంది కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'సీటీమార్'. దీన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి దీన్ని నిర్మించారు. తమన్నా హీరోయిన్‌గా నటించగా.. భూమిక కీలక పాత్రను పోషించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఫుల్ లెంగ్త్ మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో భారీ స్థాయిలో విడుదలైంది.

సినిమా బిజినెస్ ఎక్కడ ఎంత జరిగింది?

సినిమా బిజినెస్ ఎక్కడ ఎంత జరిగింది?

ఆరంభంలో హిట్లు అందుకున్నా గోపీచంద్‌కు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ కొంచెం తక్కువనే చెప్పాలి. అయితే, 'సీటీమార్'కు మాత్రం నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో రూ. 5 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ. 11.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

9వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చిందంటే?

9వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చిందంటే?

'సీటీమార్' మూవీకి తొమ్మిదవ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 5 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 22 లక్షలు షేర్, రూ. 38 లక్షలు గ్రాస్‌నే వసూలు అయింది.

9 రోజులకు కలిపి ఎంత రాబట్టిందంటే

9 రోజులకు కలిపి ఎంత రాబట్టిందంటే

విడుదలైన కొత్తలో సత్తా చాటిన 'సీటీమార్' మూవీ 9 రోజులకు కలిపి నైజాంలో రూ. 2.38 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.72 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.21 కోట్లు, ఈస్ట్‌లో రూ. 91 లక్షలు, వెస్ట్‌లో రూ. 55 లక్షలు, గుంటూరులో రూ. 1.02 కోటి, కృష్ణాలో రూ. 54 లక్షలు, నెల్లూరులో రూ. 46 లక్షలతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.79 కోట్లు షేర్, రూ. 14.60 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వసూళ్లు ఎంత

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వసూళ్లు ఎంత

రెండు రాష్ట్రాల్లో తొమ్మిది రోజుల్లో రూ. 8.79 కోట్లు షేర్ రాబట్టిన గోపీచంద్ 'సీటీమార్' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 33 లక్షలు, ఓవర్సీస్‌లో (అమెరికాలో ప్రదర్శించలేదు) రూ. 8 లక్షలు వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లో ఈ చిత్రం రూ. 9.20 కోట్లు షేర్, రూ. 15.50 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా టార్గెట్‌కు క్రమక్రమంగా దగ్గరవుతోంది.

Recommended Video

Seetimaarr Movie Team Vinayaka Chaviti Special Interview
మూవీ టార్గెట్ ఎంత? ఇంక ఎంతొస్తే హిట్?

మూవీ టార్గెట్ ఎంత? ఇంక ఎంతొస్తే హిట్?

గోపీచంద్ నటించిన 'సీటీమార్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలిపి (అమెరికాలో లేదు) రూ. 11.50 కోట్లు మేర వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ. 12 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ చిత్రం తొమ్మిది రోజుల్లో రూ. 9.20 కోట్లు వసూలు చేసింది. అంటే.. మరో రూ. 2.80 కోట్లు వసూలు చేస్తేనే ఈ మూవీ క్లీన్ హిట్‌ స్టేటస్‌ను అందుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X