Viswam Day 1 Collections : టగ్ ఆఫ్ వార్‌లోనూ ఇరగదీసిన విశ్వం .. ఫస్ట్ డే గోపీచంద్ మూవీకి ఎన్ని కోట్లంటే?
ఫ్లాప్స్‌లో ఉన్న దర్శకుడు శ్రీనువైట్ల, హీరో గోపిచంద్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ విశ్వం. ఎలాంటి ప్రయోగాలు చేయకుండా తనకు బాగా కలిసొచ్చిన కామెడీనే నమ్ముకుని విశ్వం తీశారు శ్రీనువైట్ల. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్కెట్‌లో ఎన్నో సినిమాలు పోటీనిస్తున్నా పండగ ఉందనే కాన్ఫిడెంట్‌తో బరిలో దిగాడు విశ్వం. మరి ఈ సినిమా ఫస్ట్ డే ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుందో చూస్తే :
విశ్వంను ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు . చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై వేను దొనేపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నాలు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో గోపీచంద్, కావ్య థాపర్‌లతో పాటు జిషు సేన్‌గుప్తా, నరేష్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రగతి, పార్థిబన్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, నాగినీడు తదితరులు కీలకపాత్ర పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందజేశారు.

ఇప్పటికే రిలీజైన టీజర్ , ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో విశ్వం మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. విశ్వం సినిమా నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్‌లో రూ.1.5 కోట్లు, ఆంధ్రాలో రూ.4.5 కోట్ల మేర మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని రూ.1.5 కోట్ల బిజినెస్ చేశాయి. అంటే వరల్డ్ వైడ్‌గా రూ.11. 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిని బట్టి రూ.12.5 కోట్ల షేర్, దాదాపు రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తే విశ్వం సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 థియేటర్‌లలో విడుదలైన విశ్వం సినిమా తొలిరోజు మంచి వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ఫస్ట్ డే రూ. రూ.6 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను అందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌తో కలిపి మరో రూ.2 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

మొత్తం మీద చూసుకుంటే ఫ్లాప్స్‌లో నిలబడిన గోపీచంద్‌కు విశ్వం రిజల్ట్ విజయదశమి కానుకేనని చెప్పొచ్చు. కామెడీకి పెద్ద పీట వేయడంతో పండగపూట ఇంటిల్లిపాది ఈ సినిమాకు మంచి వినోదాన్ని అందిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. గోపీచంద్ కూడా తన రెగ్యులర్ మాస్ మసాలా మాదిరిగా కాకుండా తన కామెడీ టైమింగ్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. దసరా సెలవుల తర్వాత వచ్చే కలెక్షన్లను బట్టి సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుందని ఫిలింనగర్ టాక్.


Click it and Unblock the Notifications











