Viswam Day 1 Collections : విశ్వం ఓపెనింగ్స్ అదరహో.. తొలి రోజు గోపీచంద్ మూవీకి ఎన్ని కోట్లంటే?
జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ తర్వాత కామెడీ సినిమాల స్పెషలిస్ట్‌గా ఒక వెలుగు వెలిగిన శ్రీనువైట్ల ఒక్క హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అలాగే ఫ్లాప్స్‌లో ఉన్న హీరో గోపీచంద్ కూడా రేసులో నిలబడటానికి ఓ సాలీడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన చిత్రమే విశ్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి రోజు ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే :
విశ్వం సినిమా రిజల్ట్‌పై పై చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. దర్శకుడు శ్రీనువైట్ల, హీరో గోపీచంద్, హీరోయిన్ కావ్యథాపర్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌లకు ఓ సాలీడ్ హిట్ అవసరం. ఈ ఫెయిల్యూర్స్‌ను తట్టుకుని నిలబడాలని వారంతా కష్టపడి సినిమా చేశారు. ఇప్పటికే రిలీజైన టీజర్ , ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో విశ్వం మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

విశ్వం సినిమా నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్‌లో రూ.1.5 కోట్లు, ఆంధ్రాలో రూ.4.5 కోట్ల మేర మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని రూ.1.5 కోట్ల బిజినెస్ చేశాయి. అంటే వరల్డ్ వైడ్‌గా రూ.11. 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిని బట్టి రూ.12.5 కోట్ల షేర్, దాదాపు రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తే విశ్వం సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లు.
ఈ సినిమాను ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి రూ.50 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు . చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై వేను దొనేపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నాలు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో గోపీచంద్, కావ్య థాపర్‌లతో పాటు జిషు సేన్‌గుప్తా, నరేష్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రగతి, పార్థిబన్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, నాగినీడు తదితరులు కీలకపాత్ర పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందజేశారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన విశ్వం సినిమా తొలిరోజు ఎంత రాబడుతుందో పరిశీలిస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజున రూ. 16 కోట్లు అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.11 కోట్లు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌తో కలిపి మరో రూ.5 లక్షల మేర గ్రాస్ వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. దేవర, వేట్టయన్, జనక అయితే గనక, స్వాగ్ తదితర చిన్నాపెద్ద సినిమాల పోటీని తట్టుకుని విశ్వం ఏమేరకు నిలబడుతుందో చూడాలి. కాకపోతే.. పండుగ సీజన్ పైనే విశ్వం యూనిట్ ఆశలు పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











