Viswam Day 10 Collections : గోపీచంద్ మాస్ బీభత్సం ... 10వ రోజు విశ్వం మూవీకి ఎన్ని కోట్లంటే?
తన కటౌట్‌కు తగ్గ సరైన బొమ్మపడితే తనను అడ్డుకోవడం కష్టమని చెబుతున్నాడు మాచో స్టార్ గోపీచంద్. చాలా ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తోన్న ఆయన విజయం కోసం పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే కామెడీ సినిమాల స్పెషలిస్ట్ శ్రీనువైట్లతో కలిసి చేసిన చిత్రమే విశ్వం. దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజైన విశ్వం విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. పండల సెలవులు ముగిసినా ఫ్యామిలీ ఆడియన్స్ కారణంగా ఈ సినిమాకు మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో గోపీచంద్ మూవీ 10వ రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూస్తే.
హిట్ గోపీచంద్‌కు ఎంత ముఖ్యమో దర్శకుడిగా శ్రీనువైట్లకు కూడా అంతే ముఖ్యం. ఈయన సరైన హిట్ చూసి చాలా ఏళ్లే అవుతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడిగా తనను తాను నిరూపించుకోవాలనే కసితో తనలోని కామెడీ టచ్‌ను బయటకు తీశాడు శ్రీను. ఫుల్ ప్యాక్ కామెడీ టచ్ ఉన్న మూవీని తెరకెక్కించాడు. విశ్వం సినిమాను ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు . చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై వేను దొనేపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నాలు సంయుక్తంగా నిర్మించారు.

ఈ మూవీలో గోపీచంద్, కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటించగా.. జిషు సేన్‌గుప్తా, నరేష్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రగతి, పార్థిబన్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, నాగినీడు తదితరులు కీలకపాత్ర పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందజేశారు. గోపీచంద్- శ్రీనువైట్ల కాంబినేషన్ అనేసరికి ఇండస్ట్రీలోనే ఒక రకమైన హైప్ వచ్చింది. ఈ క్రమంలోనే విశ్వం ట్రైలర్లు, టీజర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే వర్కవుట్ అయ్యింది.
నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్‌లో రూ.1.5 కోట్లు, ఆంధ్రాలో రూ.4.5 కోట్ల మేర మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని రూ.1.5 కోట్ల వ్యాపారం జరిగింది. అంటే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ.12.5 కోట్ల షేర్, రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్‌గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 థియేటర్‌లలో విడుదలైంది విశ్వం.

9 రోజుల వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.12.17 కోట్ల గ్రాస్ వసూళ్లను , రూ. 6 కోట్ల షేర్ రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 60 శాతం పైగా రికవరీ సాధించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి మరో రూ.6 కోట్లను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆదివారం కావడంతో 10వ రోజు విశ్వం బుకింగ్స్ దుమ్మురేపాయి. కుటుంబ ప్రేక్షకుల స్పందన బాగుండటంతో ఫస్ట్ షో, సెకండ్ షోలకు హౌస్‌ఫుల్ బోర్డులు పడినట్లుగా బాక్సాఫీస్ రిపోర్ట్ చెబుతోంది.
10వ రోజు విశ్వం మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ. 1.15 కోట్ల రేంజ్‌లో షేర్ వసూలు చేసి చిత్ర యూనిట్‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. మొత్తంగా 10 రోజుల వరకు గోపీచంద్ సినిమా రూ.11.16 కోట్ల నికర వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ దిశగా దూసుకెళ్తోంది.


Click it and Unblock the Notifications











