Viswam Day 11 Collections : గోపీచంద్ అరాచకం ... 11వ రోజు విశ్వం మూవీకి ఎన్ని కోట్లంటే?

ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ దేవర మిక్స్‌డ్ టాక్‌తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు వచ్చిన టాక్‌కి వస్తున్న కలెక్షన్స్‌కి ఏమాత్రం పొంతన కుదరడం లేదు. తాజాగా దేవర బాటలోనే నడుస్తోంది మాచో స్టార్ గోపీచంద్ నటించిన విశ్వం. హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన వేళ మిక్స్‌డ్ టాక్ రావడంతో సినిమా పని అయిపోయిందని అంతా భావించారు. కానీ అంచనాలు తలక్రిందులు చేస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు విశ్వం. ఈ నేపథ్యంలో గోపీచంద్ మూవీ 11వ రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూస్తే..

విశ్వం సినిమాను ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు . చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై వేను దొనేపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నాలు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో గోపీచంద్, కావ్య థాపర్‌ హీరో హీరోయిన్లుగా నటించగా.. జిషు సేన్‌గుప్తా, నరేష్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రగతి, పార్థిబన్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, నాగినీడు తదితరులు కీలకపాత్ర పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందజేశారు.

Gopichand s Viswam Day 11 Collections here s the details

నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్‌లో రూ.1.5 కోట్లు, ఆంధ్రాలో రూ.4.5 కోట్ల మేర మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని రూ.1.5 కోట్ల వ్యాపారం జరిగింది. అంటే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో రూ.12.5 కోట్ల షేర్, రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్‌ను విశ్వం ముందు పెట్టారు.

దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 థియేటర్‌లలో విడుదలైంది విశ్వం . పది రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6.80 కోట్ల షేర్, వరల్డ్ వైడ్‌గా రూ. 7.57 కోట్ల షేర్ అందుకుని గోపీచంద్‌కి ఊరట కలిగించింది. వీకెండ్‌లో దుమ్మురేపిన విశ్వం.. వర్కింగ్ డే అయిన సోమవారం (11వ రోజు) కాస్తంత నిరాశపరిచింది. వరల్డ్ వైడ్‌గా రూ. 75 లక్షల నుంచి రూ. 90 లక్షల మధ్యలో వసూళ్లు సాధించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Gopichand s Viswam Day 11 Collections here s the details

మొదట్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొడుతుందా లేదా అనే డౌడ్స్ వచ్చినప్పటికీ సెకండ్ వీక్‌ నాటికి పుంజుకుంది. మరో 5 కోట్ల షేర్ అందుకుంటే విశ్వం క్లీన్ హిట్‌గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీపావళి వరకు ఏ సినిమా లేకపోవడం, ఫెస్టివల్ సీజన్ కావడంతో విశ్వంకు కలిసొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వసూళ్ల విశ్వం చిత్ర యూనిట్ సంబరాలు జరుపుకుంటోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విజయయాత్ర నిర్వహించగా.. హైదరాబాద్‌లోనూ సక్సెస్ మీట్ జరుపుకుంది.

More from Filmibeat

Read more about: gopichand viswam kavya thapar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X