Viswam Day 12 Collections: వసూళ్లలో ఎన్టీఆర్‌కే పోటీ ఇస్తోన్న గోపీచంద్ ..12వ రోజు విశ్వం మూవీకి ఎన్ని కోట్లంటే
తన కటౌట్‌కు తగ్గ సినిమా పడితే ఎలా ఉంటుందో మాచో స్టార్ గోపీచంద్ చూపిస్తున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఆయన నటించిన విశ్వం సినిమా ఊహించిన కలెక్షన్స్‌ను రాబడుతోంది. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ మహారాజ పోషకులుగా నిలిచారు. కామెడీ టచ్, గోపీచంద్ నటనతో విశ్వం సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.
ఈ నేపథ్యంలో గోపీచంద్ మూవీ 12వ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే..
విశ్వం సినిమాను ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు . చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై వేను దొనేపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నాలు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో గోపీచంద్, కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటించగా.. జిషు సేన్‌గుప్తా, నరేష్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రగతి, పార్థిబన్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, నాగినీడు తదితరులు కీలకపాత్ర పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందజేశారు.

గోపీచంద్ - శ్రీనువైట్ల కలయికలో సినిమా అనగానే ఇండస్ట్రీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒకరేమో మాస్ చిత్రాలకు కేరాఫ్.. ఇంకొకరు కామెడీ స్పెషలిస్ట్ అలాంటి వీరిద్దరి కాంబోలో సినిమా అనగానే ఏదో కొత్తగానే ఉంటుందని అంతా ఎక్స్‌పెక్ట్ చేశారు. టీజర్ , ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ రావడంతో విశ్వం సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
విశ్వం.. నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్‌లో రూ.1.5 కోట్లు, ఆంధ్రాలో రూ.4.5 కోట్ల మేర మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని రూ.1.5 కోట్ల వ్యాపారం జరిగింది. అంటే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో రూ.12.5 కోట్ల షేర్, రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్‌ను విశ్వం ముందు పెట్టారు.

దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 థియేటర్‌లలో విడుదలైంది విశ్వం . పది రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6.80 కోట్ల షేర్, వరల్డ్ వైడ్‌గా రూ. 7.57 కోట్ల షేర్ అందుకుని గోపీచంద్‌కి ఊరట కలిగించింది. గత వారం బాక్సాఫీస్‌ను వణికించిన విశ్వం.. వర్క్ డేస్ కావడంతో కాస్త తగ్గింది అయినప్పటికీ రోజుకు రూ.70 లక్షల రేంజ్‌లో షేర్ అందుకుంటూ విశ్లేషకులనే ఆశ్చర్యపరుస్తోంది. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవరకు కొన్ని సెంటర్స్‌లో విశ్వం టఫ్ ఫైట్ ఇస్తోందని సోషల్ మీడియా టాక్.
12వ రోజు ప్రపంచవ్యాప్తంగా గోపీచంద్ మూవీ రూ. కోటి 60 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సోమవారం ఏకంగా రూ. 75 లక్షల షేర్ సాధించి ఆశ్చర్యపరిచింది విశ్వం. మొత్తంగా ఈ సినిమా 12 రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా 12.63 కోట్ల నికర వసూళ్లను సాధించిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాదాపు 80 శాతం మేర రికవరీ సాధించి బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకెళ్తోంది. వర్కింగ్ డేస్‌లోనే గోపీచంద్ ఇరగదీస్తుండటంతో వీకెండ్‌లో కలెక్షన్స్ మరింత ఎత్తుకుంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











