Viswam Day 13 Collections : బాక్సాఫీస్ వద్ద గోపీచంద్ విశ్వరూపం ... 13వ రోజు విశ్వం మూవీకి ఎన్ని కోట్లంటే?
గత కొంతకాలంగా సరైన హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వచ్చిన విశ్వం మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజైన ఈ మూవీ పండగ సెలవుల్లో మంచి హోల్డ్‌ను సాధించింది. తర్వాత గోపీచంద్ దుకాణం సర్దేస్తాడని అనుకుంటే వర్కింగ్ డేస్‌లోనూ వసూళ్ల పంట పండిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గోపీచంద్ మూవీ 13వ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే..
విశ్వం సినిమాను ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు . చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై వేను దొనేపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నాలు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో గోపీచంద్, కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటించగా.. జిషు సేన్‌గుప్తా, నరేష్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రగతి, పార్థిబన్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, నాగినీడు తదితరులు కీలకపాత్ర పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందజేశారు.

విశ్వం.. నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్‌లో రూ.1.5 కోట్లు, ఆంధ్రాలో రూ.4.5 కోట్ల మేర మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని రూ.1.5 కోట్ల వ్యాపారం జరిగింది. అంటే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో రూ.12.5 కోట్ల షేర్, రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్‌ను విశ్వం ముందు పెట్టారు.
దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 థియేటర్‌లలో విడుదలైంది విశ్వం . తొలి మూడు రోజుల్లో కలెక్షన్ల వర్షం కురిపించాడు గోపీచంద్. అప్పటికే మార్కెట్‌లో ఎన్టీఆర్ దేవర, రజనీకాంత్ వేట్టయన్ సహా చిన్నా పెద్దా సినిమాలు ఉన్నాయి. ఈ పోటీని తట్టుకుని బాగానే వసూళ్లు రాబడుతోంది విశ్వం. ప్రస్తుతం దేవర కూడా థియేట్రికల్ రన్ పూర్తి చేసేందుకు దగ్గరలో ఉంది. మరో పెద్ద సినిమా లేకపోవడంతో గోపీచంద్ సినిమాకు బుకింగ్స్ బాగానే జరుగుతున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కామెడీ టచ్ బాగుండటంతో విశ్వం హోల్డింగ్ బాగానే ఉందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో 13వ రోజు విశ్వం కలెక్షన్స్‌ని ఒకసారి పరిశీలిస్తే.. గురువారం కూడా ఈ సినిమా ఎక్సలెంట్ రిజల్ట్ చూపించినట్లుగా విశ్లేషకులు అంటున్నారు. బుధవారం ప్రపంచవ్యాప్తంగా రూ. 50 లక్షల పైనే షేర్ అందించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా 13 రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా 13.42 కోట్ల నికర వసూళ్లను సాధించిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాదాపు 80 శాతం మేర రికవరీ సాధించి బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకెళ్తోంది విశ్వం. మరో రెండ్రోజుల్లో వీకెండ్ మొదలుకానుండటంతో గోపీచంద్ ఏ రేంజ్‌లో తన ప్రభంజనం చూపిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











