Viswam Day 3 Collections : గోపీచంద్ ఊచకోత ఇలా ఉంటుందా ... 3వ రోజు విశ్వం మూవీకి ఎన్ని కోట్లంటే?
మాస్ సినిమాల స్పెషలిస్ట్ గోపీచంద్, కామెడీ కింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనువైట్ల కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీతో పాటు అభిమానులు కూడా షాకయ్యారు. రెండు భిన్న ధ్రువాలు కావడంతో పాటు ఇద్దరికి ఈ మధ్యకాలంలో విజయాలు లేవు. అలాంటి శ్రీనువైట్ల, గోపీచంద్ కాంబోలో వచ్చిన సినిమాయే విశ్వం. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రెండు రోజులు మంచి వసూళ్లను సాధించిన గోపీచంద్.. 3వ రోజు ఎన్ని కోట్లను రాబట్టాడో చూస్తే :
విశ్వంను ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు . చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై వేను దొనేపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నాలు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో గోపీచంద్, కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటించగా.. జిషు సేన్‌గుప్తా, నరేష్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రగతి, పార్థిబన్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, నాగినీడు తదితరులు కీలకపాత్ర పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందజేశారు.

సరైన హిట్స్ లేక సతమతం అవుతున్న గోపీచంద్- శ్రీనువైట్ల జట్టు కట్టారు అనేసరికి టాలీవుడ్ జనాలకు కొత్తగా అనిపించింది. టీజర్ , ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ రావడంతో విశ్వం మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్‌లో రూ.1.5 కోట్లు, ఆంధ్రాలో రూ.4.5 కోట్ల మేర మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని రూ.1.5 కోట్ల వ్యాపారం జరిగింది. అంటే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.11. 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
రూ.12.5 కోట్ల షేర్, రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్‌గా గోపీచంద్ మూవీ బరిలో దిగింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 థియేటర్‌లలో విడుదలైన విశ్వం సినిమా తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రూ.6 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ పైగా కామెడీ టచ్ బాగుందని కామెంట్స్ వినిపించడంతో పండగ పూట ఫ్యామిలీ ఆడియన్స్‌తో థియేటర్లు నిండాయి. తొలి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ బాగున్నాయని బాక్సాఫీస్ రిపోర్ట్ చెబుతోంది. సెకండ్ డే గోపీచంద్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.7 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు అందుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండో రోజు నాటికే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి 100 శాతం రికవరీ చేసినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్‌గా పోస్టర్ రిలీజ్ చేసింది.

ఇక మూడో రోజు విషయానికి వస్తే.. పండగ సెలవుల్లో లాస్ట్ సండే కావడంతో విశ్వం బుకింగ్స్‌లో బాగానే హోల్డ్ చేసినట్లుగా రిపోర్ట్స్ చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్లు, హిందీ, కర్ణాటక , రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకుని ఆదివారం గోపీచంద్ మూవీ రూ.4 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా మూడు రోజుల నాటికి విశ్వం ఇండియా వైడ్‌గా రూ.5.75 కోట్ల నికర వసూళ్లను రాబట్టినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆదివారంతో దసరా సెలవులు ముగియడంతో ఈ వారం వచ్చే కలెక్షన్సే సినిమా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.


Click it and Unblock the Notifications











