Viswam Day 4 Collections:గోపీచంద్‌కి షాకిచ్చిన కలెక్షన్స్..4వ రోజు విశ్వం మూవీకి ఎన్ని కోట్లంటే?

సరైన హిట్ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న గోపీచంద్, శ్రీనువైట్లకు కాస్త ఊరటనిచ్చింది విశ్వం. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ విశ్వం.. దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రెండు రోజులు మంచి వసూళ్లను సాధించిన గోపీచంద్.. కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లను ఒడ్డున పడేసినట్లు ఫిలింనగర్ టాక్. మరి 4వ రోజైన సోమవారం విశ్వం ఎన్ని కోట్లను రాబట్టాడో చూస్తే :

దసరా సీజన్‌ను నమ్ముకుని బరిలో దిగిన విశ్వం నిర్మాతలకు ప్లాన్ బాగానే వర్కవుట్ అయ్యింది. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా .. రెండో రోజైన పండగ నాడు మరించి రెచ్చిపోయింది. 3వ రోజుతో కలుపుకుని ఫస్ట్ వీకెండ్‌లోనే గోపీచంద్ మూవీ రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఆయన అభిమానుల్లో జోష్ నింపింది. విశ్వంను ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

Gopichand s Viswam Day 4 Collections here s the details

చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై వేను దొనేపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నాలు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో గోపీచంద్, కావ్య థాపర్‌ హీరో హీరోయిన్లుగా నటించగా.. జిషు సేన్‌గుప్తా, నరేష్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రగతి, పార్థిబన్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, నాగినీడు తదితరులు కీలకపాత్ర పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందజేశారు.

విశ్వం టీజర్ , ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్‌లో రూ.1.5 కోట్లు, ఆంధ్రాలో రూ.4.5 కోట్ల మేర మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని రూ.1.5 కోట్ల వ్యాపారం జరిగింది. అంటే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రూ.12.5 కోట్ల షేర్, రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్‌గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 థియేటర్‌లలో విడుదలైంది విశ్వం . కామెడీకి పెద్దపీట వేసినట్లుగా టాక్ వినిపించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఇష్టపడుతున్నారు. రెండో రోజు నాటికే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి 100 శాతం రికవరీ చేసినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్‌గా పోస్టర్ రిలీజ్ చేసింది.

ఇక నాలుగో రోజు విషయానికి వస్తే.. ఆదివారంతో దసరా సెలవులు ముగియడంతో సోమవారం వర్కింగ్ డే నాడు విశ్వం మూవీకి బుకింగ్స్ డల్ అయ్యాయి. తిరిగి ఫస్ట్ షో, సెకండ్ షోలకు మంచి హోల్డ్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, హిందీ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్ కలుపుకుని విశ్వం మూవీ నాలుగో రోజు రూ.1.80 కోట్ల నికర వసూళ్లను సాధించినట్లుగా ట్రేడ్ పండితులు అంటున్నారు. మరి 5వ రోజైన మంగళవారం గోపీచంద్ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుందో చూడాలి.

More from Filmibeat

Read more about: gopichand viswam kavya thapar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X