Viswam Day 5 Collections : బాక్సాఫీస్‌ను బాదిపారేస్తోన్న గోపీచంద్ ... 5వ రోజు విశ్వం మూవీకి ఎన్ని కోట్లంటే?
ఒక్క హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు గోపీచంద్, శ్రీనువైట్ల. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ విశ్వం. దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో మంచి విజయాన్ని అందుకుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సక్సెస్‌తో గోపీచంద్, శ్రీనులు ఖుషీ అవుతున్నారు. పండగ సెలవుల తర్వాత కూడా విశ్వంకు బెటర్ బుకింగ్స్ జరుగుతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. మరి 5వ రోజు గోపీచంద్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
యాక్షన్, థ్రిల్లర్ కాకుండా తనను దర్శకుడిగా ఈ స్థాయిలో నిలబెట్టిన కామెడీనే నమ్ముకుని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని విశ్వం సినిమాను తెరకెక్కించారు దర్శకుడు శ్రీనువైట్ల. దసరా సీజన్, లాంగ్ వీకెండ్‌ను నమ్ముకుని బరిలో దిగిన విశ్వం నిర్మాతలకు ప్లాన్ బాగానే వర్కవుట్ అయ్యింది. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లోనే రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి చాలా ఏరియాల్లో బయ్యర్లను ఒడ్డున పడేసింది. రెండో రోజు నాటికే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి 100 శాతం రికవరీ చేసినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్‌గా పోస్టర్ రిలీజ్ చేసింది.

విశ్వంను ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు . చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై వేను దొనేపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నాలు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో గోపీచంద్, కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటించగా.. జిషు సేన్‌గుప్తా, నరేష్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రగతి, పార్థిబన్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, నాగినీడు తదితరులు కీలకపాత్ర పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందజేశారు.
విశ్వం టీజర్ , ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్‌లో రూ.1.5 కోట్లు, ఆంధ్రాలో రూ.4.5 కోట్ల మేర మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని రూ.1.5 కోట్ల వ్యాపారం జరిగింది. అంటే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ.12.5 కోట్ల షేర్, రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్‌గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 థియేటర్‌లలో విడుదలైంది విశ్వం .

దసరా సెలవులు ముగిసిన తర్వాత సెకండ్ వర్కింగ్ డే నాడు విశ్వం మూవీకి బుకింగ్స్ బాగా పడిపోయాయని టాక్. అయితే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, వరంగల్, గుంటూరు వంటి మెయిన్ సెంటర్స్‌లో తిరిగి ఫస్ట్ షో, సెకండ్ షోలకు హాళ్లు నిండినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, హిందీ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్ కలుపుకుని విశ్వం మూవీ ఐదో రోజు రూ.కోటి వరకు నికర వసూళ్లను సాధించినట్లుగా ట్రేడ్ పండితులు అంటున్నారు. సినిమా విజయం సాధించడంతో బుధవారం హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో విశ్వం సక్సెస్‌మీట్ నిర్వహిస్తున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.


Click it and Unblock the Notifications











