Viswam Day 6 Collections : స్లో అండ్ స్టడీగా కుమ్మేస్తోన్న గోపీచంద్ ... 6వ రోజు విశ్వం మూవీకి ఎన్ని కోట్లంటే?
గోపీచంద్ , శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కిన విశ్వం మూవీ అంచనాలను మించి వసూళ్లు రాబట్టి వీరిద్దరికి ఊరట కలిగించింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినా కామెడీ టచ్ బాగుందనే మౌత్ టాక్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని బాగానే ఆదరిస్తున్నారు. దసరా చివరి మూడు రోజులూ కుమ్మిపడేసిన గోపీచంద్.. వర్కింగ్ డేస్‌లోనూ బాగానే హోల్డ్ చేస్తున్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి 6వ రోజు గోపీచంద్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
ఒక్క హిట్ కోసం గోపీచంద్, శ్రీనువైట్ల కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఒకదానికొకటి సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్నా పట్టు వదలకుండా ప్రయత్నించారు. చివరికి విశ్వం మూవీ ద్వారా వీరి ఆశలు ఫలించినట్లే కనిపిస్తున్నాయి. హిట్ కోసం శ్రీనువైట్ల తన రెగ్యులర్ కామెడీ ఫార్ములాను పక్కనపెట్టి చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అవ్వడంతో ఆయన మరోసారి కామెడీనే నమ్ముకున్నారు. కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల ఇలా విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుని విశ్వం సినిమాను తెరకెక్కించారు శ్రీనువైట్ల.

దసరా సీజన్, లాంగ్ వీకెండ్‌ను నమ్ముకుని బరిలో దిగిన విశ్వం నిర్మాతలకు ప్లాన్ బాగానే వర్కవుట్ అయ్యింది. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లోనే రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. రెండో రోజు నాటికే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి 100 శాతం రికవరీ చేసినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్‌గా పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సక్సెస్‌తో చిత్ర యూనిట్ సంబరాలు జరుపుకుంటోంది. హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీనువైట్లతో కలిసి యూనిట్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో విజయోత్సవ ర్యాలీల్లో పాల్గొంటోంది. నిన్న హైదరాబాద్‌లో విశ్వం సక్సెస్ మీట్ గ్రాండ్‌గా జరిగింది.
కాగా.. విశ్వంను ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు . చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై వేను దొనేపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నాలు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో గోపీచంద్, కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటించగా.. జిషు సేన్‌గుప్తా, నరేష్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రగతి, పార్థిబన్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, నాగినీడు తదితరులు కీలకపాత్ర పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందజేశారు.

కొత్త కాంబినేషన్ అయినప్పటికీ విశ్వంకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్‌లో రూ.1.5 కోట్లు, ఆంధ్రాలో రూ.4.5 కోట్ల మేర మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని రూ.1.5 కోట్ల వ్యాపారం జరిగింది. అంటే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ.12.5 కోట్ల షేర్, రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్‌గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 థియేటర్‌లలో విడుదలైంది విశ్వం . ఆరో రోజు విశ్వం మూవీకి ఏపీ , తెలంగాణ, కర్ణాటక, హిందీ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకుని రూ. కోటికి పైగా గ్రాస్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తంగా తొలి ఆరు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా రూ.8 కోట్ల నికర వసూళ్లను సాధించాడు గోపీచంద్.


Click it and Unblock the Notifications











