Viswam Day 7 Collections : గోపీచంద్ మాస్ ర్యాంపేజ్ ... 7వ రోజు విశ్వం మూవీకి ఎన్ని కోట్లంటే?
గోపీచంద్ , శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కిన విశ్వం మూవీ థియేటర్‌లో విడుదలై సక్సెస్‌ఫుల్‌గా వారం రోజులు కంప్లీట్ చేసుకుంది. కామెడీ టచ్, క్లీన్ మూవీగా టాక్ రావడంతో కుటుంబ ప్రేక్షకుల నుంచి విశ్వంకు మంచి ఆదరణ దక్కుతోంది. హిట్ రుచి చూసి చాలా ఏళ్లు కావొస్తుండటంతో గోపీచంద్, దర్శకుడు శ్రీనువైట్ల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. విడుదలైన ఈ వారంలో గోపీచంద్ మూవీ ఎంత కలెక్ట్ చేసింది? 7వ రోజు విశ్వం ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
గోపీచంద్, శ్రీనువైట్ల హిట్ కొట్టాలనే లక్ష్యంతో కసిగా పనిచేశారు. ప్రయోగాల జోలికి పోకుండా పండక్కి అందరూ కలిసి చూసేలా విశ్వం తెరకెక్కించారు శ్రీను. మరోసారి కామెడీయే ఆయనను రక్షించింది. విశ్వంలోని కామెడీ సీన్స్, గోపీచంద్ నటన సినిమాకు ప్లస్ అయ్యాయి. కథ, స్క్రీన్ ప్లే, నటీనటులు ఇలా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోబట్టే ఈ రిజల్ట్ కనిపిస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీనువైట్లతో కలిసి యూనిట్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో విజయోత్సవ ర్యాలీల్లో పాల్గొంటోంది. రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లో విశ్వం సక్సెస్ మీట్ గ్రాండ్‌గా జరిగింది.

విశ్వంను ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు . చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై వేను దొనేపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నాలు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో గోపీచంద్, కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటించగా.. జిషు సేన్‌గుప్తా, నరేష్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రగతి, పార్థిబన్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, నాగినీడు తదితరులు కీలకపాత్ర పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందజేశారు.
దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజైన విశ్వం.. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లోనే రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. రెండో రోజు నాటికే డిస్ట్రిబ్యూటర్లకు 100 శాతం రికవరీ అందించినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్‌గా పోస్టర్ రిలీజ్ చేసింది. గోపీచంద్- శ్రీనువైట్ల కాంబినేషన్ అనేసరికి ఒక రకమైన హైప్ వచ్చింది.

ఈ కాంబోకు తోడు టీజర్, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో విశ్వంకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్‌లో రూ.1.5 కోట్లు, ఆంధ్రాలో రూ.4.5 కోట్ల మేర మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని రూ.1.5 కోట్ల వ్యాపారం జరిగింది. అంటే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
రూ.12.5 కోట్ల షేర్, రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్‌గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 థియేటర్‌లలో విడుదలైంది విశ్వం . ఏడో రోజు ఈ మూవీకి ఏపీ , తెలంగాణ, కర్ణాటక, హిందీ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకుని రూ. కోటికి పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వర్కింగ్ డే అయినప్పటికీ గురువారం ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం గోపీచంద్ అభిమానులకు ఊరట కలిగించింది. రెండో వారంలో విశ్వం ఏ మేర రాణిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











