Viswam Day 8 Collections: గోపీచంద్ మాస్ జాతర ..8వ రోజు విశ్వం మూవీకి ఎన్ని కోట్లంటే?
మాచో స్టార్ గోపీచంద్ , కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన మూవీ విశ్వం. దసరా కానుకగా టఫ్ ఫైట్ మధ్య రిలీజైన ఈ సినిమా ఫస్ట్ వీక్‌లో పర్వాలేదనిపించేలా కలెక్షన్లు అందుకుంది. దేవర, వేట్టయన్ , జిగ్రా వంటి బడా సినిమాలు థియేటర్‌లో ఉన్నా బాగానే హోల్డ్ చేసింది. రెండో వారంలోకి అడుగుపెట్టిన విశ్వం 8వ రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూస్తే.
దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజైన ఈ సినిమా పండగ సీజన్‌నే నమ్ముకుంది. కుటుంబ ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చే అన్ని రకాల అంశాలను మిక్స్ చేసి సినిమాను తెరకెక్కించారు శ్రీనువైట్ల. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న ఆయన యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ సబ్జెక్ట్స్ పక్కనబెట్టి తనకు బాగా అచ్చొచ్చిన కామెడీనే టచ్ చేశారు . విశ్వంను ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు . చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై వేను దొనేపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నాలు సంయుక్తంగా నిర్మించారు.

ఈ మూవీలో గోపీచంద్, కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటించగా.. జిషు సేన్‌గుప్తా, నరేష్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రగతి, పార్థిబన్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, నాగినీడు తదితరులు కీలకపాత్ర పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందజేశారు. టీజర్, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో విశ్వంకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. గోపీచంద్- శ్రీనువైట్ల కాంబినేషన్ అనేసరికి ఒక రకమైన హైప్ వచ్చింది.
నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్‌లో రూ.1.5 కోట్లు, ఆంధ్రాలో రూ.4.5 కోట్ల మేర మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని రూ.1.5 కోట్ల వ్యాపారం జరిగింది. అంటే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ.12.5 కోట్ల షేర్, రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్‌గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 థియేటర్‌లలో విడుదలైంది విశ్వం . తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లోనే రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.

8వ రోజు ఈ మూవీకి ఏపీ , తెలంగాణ, కర్ణాటక, హిందీ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకుని రూ. కోటికి పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వర్కింగ్ డే అయినప్పటికీ శుక్రవారం ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం గోపీచంద్ అభిమానులకు ఊరట కలిగించింది. దసరా సెలవుల్లో మంచి వసూళ్లను రాబట్టిన విశ్వం మూవీ వర్కింగ్ డేస్‌లోనూ మంచి హోల్డ్ సాధించడం విశేషం. బుకింగ్స్‌లో డ్రాప్స్ లేకుండా పరుగులు తీస్తున్న గోపీచంద్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ దిశగా పరుగులు తీస్తోంది. వీకెండ్ మళ్లీ మొదలుకావడంతో ఈ సినిమాకు మంచి వసూళ్లు దక్కుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.


Click it and Unblock the Notifications











