Viswam Day 9 Collections: కుమ్మిపడేస్తోన్న గోపీచంద్ ..9వ రోజు విశ్వం మూవీకి ఎన్ని కోట్లంటే?

చిత్ర పరిశ్రమ సక్సెస్ వెంటే పరుగులు తీస్తుందన్న సంగతి తెలిసిందే. సినిమా భాషలో హిట్ కొట్టే వారే ఇండస్ట్రీకి ముఖ్యం. ఎంతటి స్టార్ హీరో అయినా సరే సరైన హిట్ లేకుంటే అంతే సంగతులు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు హిట్ కొట్టలేక కెరీర్ ముగించిన హీరోలను ఎంతో మందిని చూశాం. ఒక్క హిట్ కోసం ఏళ్లుగా యుద్ధం చేస్తున్నారు హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీనువైట్ల. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాయే విశ్వం. దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజైన విశ్వం విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో గోపీచంద్ మూవీ 9వ రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూస్తే.

పండగ సీజన్‌నే నమ్ముకుని బరిలో దిగింది విశ్వం. కుటుంబ ప్రేక్షకులు, రిపీట్ ఆడియన్స్‌ని టార్గెట్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు శ్రీనువైట్ల. తనకు బాగా అచ్చొచ్చిన కామెడీపైనే భారం వేసి బరిలో దిగారు . విశ్వం సినిమాను ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు . చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై వేను దొనేపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నాలు సంయుక్తంగా నిర్మించారు.

Gopichand s Viswam Day 9 Collections here s the details

ఈ మూవీలో మాచో స్టార్ గోపీచంద్, కావ్య థాపర్‌ హీరో హీరోయిన్లుగా నటించగా.. జిషు సేన్‌గుప్తా, నరేష్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రగతి, పార్థిబన్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, నాగినీడు తదితరులు కీలకపాత్ర పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందజేశారు. యాక్షన్ హీరోతో , కామెడీ ఎక్స్‌పర్ట్ జత కలవడమే పెద్ద సాహసం. దీనికి తోడు టీజర్, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో విశ్వంకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. గోపీచంద్- శ్రీనువైట్ల కాంబినేషన్ అనేసరికి ఒక రకమైన హైప్ వచ్చింది.

నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్‌లో రూ.1.5 కోట్లు, ఆంధ్రాలో రూ.4.5 కోట్ల మేర మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని రూ.1.5 కోట్ల వ్యాపారం జరిగింది. అంటే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ.12.5 కోట్ల షేర్, రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్‌గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 థియేటర్‌లలో విడుదలైంది విశ్వం.

Gopichand s Viswam Day 9 Collections here s the details

9వ రోజు ఈ మూవీకి ఏపీ , తెలంగాణ, కర్ణాటక, హిందీ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకుని రూ. కోటికి పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వీకెండ్ మళ్లీ మొదలుకావడంతో ఈ సినిమాకు మంచి వసూళ్లు దక్కుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. 9 రోజుల వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.12.17 కోట్ల గ్రాస్ వసూళ్లను , రూ. 6 కోట్ల షేర్ సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 60 శాతం పైగా రికవరీ సాధించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి మరో రూ.6 కోట్లను రాబట్టాల్సి ఉంది. మరి ఈ వీకెండ్‌లో విశ్వం ఏమైనా గ్రోత్ చూపిస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Read more about: gopichand viswam kavya thapar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X