మెగా న్యూస్ : డేట్ మార్చి ప్రకటించారు

By Srikanya

హైదరాబాద్ : రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కాజల్‌ హీరోయిన్. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ప్రస్తుతం లండన్‌లో చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే నెల 15న పాటల్ని విడుదల చేస్తారు. అక్టోబరు 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.యువన్‌శంకర్‌ రాజా సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా రీరికార్డింగ్‌ పనులు మంగళవారం మొదలయ్యాయి. మొదటి ఈ పాటలను అక్టోబర్ 7 న చేస్తామని ప్రకటించారు. కానీ ఇలా మార్చి ప్రకటించారు.

Govindudu Andarivadele’ Audio on Sept 15th

నిర్మాత గణేశ్‌ తెలియజేస్తూ ''ఇంకో పదమూడు రోజుల షూటింగ్‌తో సినిమా పూర్తవుతుంది. రెండు రోజులతో టాకీ పార్ట్‌ అయిపోతుంది. మూడు పాటలను చిత్రీకరించాల్సి ఉంది. ఓ పాటను నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోలో వేసిన ఇంటి సెట్లో తీస్తాం. మిగిలిన రెండు పాటలను లండన్‌, జోర్డాన్‌లో రామ్‌చరణ్‌, కాజల్‌పై చిత్రీకరిస్తాం. కృష్ణవంశీ అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యువన్‌శంకర్‌ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్సవుతుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. రామ్‌చరణ్‌ లుక్స్‌ను అందరూ బాగా మెచ్చుకుంటున్నారు. సెప్టెంబర్‌ 15న పాటలనూ, అక్టోబర్‌ 1న చిత్రాన్నీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ... ''కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే చిత్రమిది. ప్రతీ సన్నివేశంలోనూ తెలుగుదనం ఉట్టిపడుతుంది. రామ్‌చరణ్‌ విదేశాల్లో పుట్టి పెరిగిన యువకుడి పాత్రలో కనిపిస్తాడు. తనవారికోసం సొంతూరికి వచ్చిన ఓ ఎన్నారై యువకుడు ఎలాంటి సందడిని సృష్టించాడన్నది ఇందులో ఆసక్తికరం. చరణ్‌ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది. లండన్‌లో హీరో,హీరోయిన్స్ పై రెండు పాటల్ని చిత్రీకరిస్తాం'' అని చెప్పుతున్నారు. శ్రీకాంత్‌, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, కమలినీ ముఖర్జీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

శ్రీకాంత్‌, కమలినీ ముఖర్జీ, ప్రకాశ్‌రాజ్‌, జయసుధ ప్రధాన పాత్రధారులైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, కూర్పు: నవీన్‌ నూలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X