మెగా హీరోల సత్తా మళ్లీ బయిటపడింది
హైదరాబాద్: రామ్ చరణ్,కృష్ణ వంశీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' . టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం బిజినెస్ షాకింగ్ కు గురి చేస్తూ ఓ రేంజిలో జరుగుతోంది. ఇప్పటివరకూ ఈ చిత్రం గురించి ఏ విషయం రివిల్ చేయకపోయినా బయ్యిర్లు,డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. రికార్డు రేట్లకు దాదాపు చాలా ఏరియాల బిజినెస్ క్లోజ్ అయిపోయినట్లు సమాచారం. ఈ బిజినెస్ చూసిన వాళ్ళు...అందుకే నిర్మాతలు మెగా హీరోలు వెంట నిర్మాతలు పడతారు అంటున్నారు.

ఆ డిస్ట్రిబ్యూటర్స్ లిస్టు ఇదిగో...
నైజాం ఏరియా- దిల్ రాజు
సీడెడ్ - లక్ష్మీ కాంత్ రెడ్డి
వైజాగ్- భరత్ పిక్చర్స్
నెల్లూరు- హరి పిక్చర్స్
ఈ చిత్రంలో రామ్ చరణ్ కొత్త లుక్ తో కనిపించటం కూడా చాలా ఆసక్తిని రేపుతోంది. దానికి తోడు ఈ టైటిల్ గతంలో చిరంజీవి చిత్రం అందరివాడులోని టైటిల్ సాంగ్ నుంచి తీసుకున్నది కావటంతో మెగా ఫ్యాన్స్ చాలా సంతోషపడుతున్నారు. కృష్ణ వంశీ తన చిత్రాలు వరసగా ఫెయిల్యూర్ కావటంతో ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టి తానేంటో మరోసారి ఇండస్ట్రీకి ప్రూవ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. కాజల్ హీరోయిన్. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత.
యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలుంటాయి. అందులో ఇప్పటికే రెండు పాటలను షూట్ చేసారు. రామ్ చరణ్ ఎన్నారైగా కనిపించనున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి కృష్ణవంశీ డైరెక్టర్. కృష్ణవంశీ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ టీజర్ ని జూలై 28న రిలీజ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











