‘గోవిందుడు అందరి వాడేలే’ ప్రిమియర్ షో కలెక్షన్స్
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం ప్రీమియర్ షో యూఎస్ఏలో ఒకరోజు ముందు(సెప్టెంబర్ 30) నిర్వహించారు. మొత్తం మంగళవారం రాత్రి దాదాపు 60కి పైగా స్క్రీన్లలో ప్రీమియర్ షో వేసారు. ప్రీమియర్ షో ద్వారా $174,183 (రూ. 1కోటి 7 లక్షలు) వసూలు చేసింది.
రామ్ చరణ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరరెక్కిన ‘గోవిందుడు అందరి వాడేలే' తొలిరోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడంతో కుటుంబ ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది.

ఎన్నారై యువకుడి పాత్రలో రామ్ చరణ్ నటించారు. కొన్ని కారణాల విడిపోయిన తన కుటుంబ సభ్యులను కలపడానికి హీరో ఏం చేసాడు? అనే పాయింటుతో సాగిన స్టోరీకి ఫ్యామిలీ అనుబంధాలు, ఆప్యాయతలు, ఎమోషన్స్, బావామరదళ్ల సరసాలు యాడ్ చేసి వినోదాత్మకంగా తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణ వంశీ.
ప్రకాష్ రాజ్, జయసుధ, రహహాన్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఆర్ట్: అశోక్‌కుమార్, ఎడిటింగ్: నవీన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, రామ్‌లక్ష్మణ్, రచన: పరుచూరి బ్రదర్స్, కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కృష్ణవంశీ, నిర్మాత : బండ్ల గణేష్.


Click it and Unblock the Notifications











