Guardians Of The Galaxy 3 day 1 collections షాకింగ్‌గా కలెక్షన్లు.. తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో గార్డియెన్స్ ఆఫ్ ది గెలాక్సీ రెండు ఫ్రాంచైజీలు భారీ సక్సెస్‌ను అందుకోవడం తెలిసిందే. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 సినిమాలు అందించిన జోష్‌తో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 వాల్యూమ్ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో క్రిస్ ప్రాట్, జో సల్తానా, బ్రాడ్లీ కూపర్, విన్ డిజిల్, కారెన్ గిల్లాన్, డేవ్ బాటిస్టా, పామ్ క్లెమెంటీఫ్, విల్ పౌల్టర్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి జేమ్స్ గున్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు కెవీన్ ఫీజ్ నిర్మాతగా, నికోలాస్ కోర్డా, సారా స్మీత్, సైమన్ హాట్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా ఇండియాలో తొలి రోజు ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..

గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 బడ్జెట్ ఎంతంటే?: అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 వాల్యూమ్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సుమారు 250 మిలియన్ డాలర్లు అంటే 2000 కోట్లకుపైగా రూపాయలతో రూపొందించారు. ఈ చిత్రంతోపాటు ది గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ హాలీడే చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించారు. ఆ కారణంగానే ఈ సినిమా బడ్జెట్ కంటే తక్కువగా అయిందని నిర్మాత పెర్ జేమ్స్ తెలిపారు.

స్క్రీన్ కౌంట్: గార్డియెన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 సినిమాకు భారీ క్రేజ్ ఉండటంతో రికార్డు స్థాయిలోనే థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఇండియాలో 2000 స్రీన్లలో రిలీజ్ చేశారు. ఇటీవల కాలంలో ఈ రేంజ్‌లో రిలీజైన హాలీవుడ్ సినిమాల్లో ఒకటిగా ఈ చిత్రం నిలిచింది. ఎక్కువగా ఈ సినిమాను మల్టీ ప్లెక్స్‌లోనే రిలీజ్ చేశారు.

మల్టీప్లెక్స్‌లో తొలి రోజు కలెక్షన్లు: గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 చిత్రం ఊహించినంతగా ఒపెనింగ్స్ సాధించకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. యాంట్‌మెన్ కంటే తక్కువగా ఈ సినిమా వసూళ్లను రాబట్టింది. నేషనల్ మల్టీప్లెక్స్ చైన్ స్క్రీన్లలో ఈ చిత్రం 3.5 కోట్లు రాబట్టింది. పీవీఆర్‌లో 1.75 కోట్లు, ఐనాక్స్‌లో 1 కోటి రూపాయలు, సినీ పోలీస్‌లో 75 లక్షల వసూళ్లను నమోదు చేసింది.

తొలి రోజు ఓవరాల్‌గా ఎంతంటే?: గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 క్రేజ్ భారీగా కనిపించినప్పటికీ.. రిలీజ్ తర్వాత ఈ సినిమాపై మిక్స్‌డ్ రివ్యూస్ రావడంతో కలెక్షన్లపై ప్రభావం చూపించింది. ఈ సినిమా ఇటీవల కాలంలో విడుదలైన హాలీవుడ్ సినిమాలతో పోల్చితే పేలవమైన వసూళ్లను సాధించింది. తొలి రోజు ఈ చిత్రం ఇండియాలో 7.35 కోట్ల షేర్, 10 కోట్ల గ్రాస్ వరకు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











