Guardians of the Galaxy Vol 3 బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? తొలి రోజు కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) మరోసారి మ్యాజిక్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా సిద్దమైంది. 2014లో రూపొందిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ, 2017లో వచ్చిన గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ 2 చిత్రాలకు సీక్వెల్‌గా గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 రిలీజ్‌కు సిద్దమైంది.
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఈ చిత్రం 32వ సినిమాగా రిలీజ్ అవుతున్నది. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ 3 చిత్రం బడ్జెట్ ఎంత? ఈ సినిమా తొలి రోజు ఎంత వసూళ్లను రాబట్టే అవకాశం ఉందనే విషయంలోకి వెళితే..

గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 1, 2 సీక్వెల్స్: గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 1 సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ చిత్రం 170 మిలియన్ డాలర్లు అంటే సుమారు 1400 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఇక గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 2 వాల్యూమ్ బడ్జెట్ విషయానికి వస్తే.. 200 మిలియన్ డాలర్లతో అంటే 1635 కోట్ల రూపాయలతో రూపొందించారు. అప్పట్లో ఈ సినిమా బడ్జెట్ రికార్డు స్థాయి అనే విషయం చర్చనీయాంశమైంది. అయితే ఈ రెండు సినిమాలను మించి గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 తెరకెక్కింది.

గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 బడ్జెట్: అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 వాల్యూమ్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సుమారు 250 మిలియన్ డాలర్లు అంటే 2000 కోట్లకుపైగా రూపాయలతో రూపొందించారు. ఈ చిత్రంతోపాటు ది గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ హాలీడే చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించారు. ఆ కారణంగానే ఈ సినిమా బడ్జెట్ కంటే తక్కువగా అయిందని నిర్మాత పెర్ జేమ్స్ తెలిపారు.

గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ భారీగా ప్రమోషన్స్: గత రెండు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సిరీస్‌లకు మించి మూడో వెర్షన్‌కు భారీగా ప్రచారం చేశారు. మార్వెల్ స్టూడియోస్ భారీగా ఈ సినిమాను మార్కెటింగ్ చేసింది. ఇటీవల హాలీవుడ్‌లో నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభించింది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ బ్రేక్ ఈవెన్: గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 చిత్రానికి సంబంధించిన బిజినెస్ భారీగానే జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ స్థాయిని 600 మిలియన్ డాలర్లు అంటే 4905 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు నిర్ణయించాయి. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో కనీసం 800 మిలియన్ డాలర్లు అంటే 6541 కోట్ల డాలర్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ తొలి రోజు కలెక్షన్లు: గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 మూవీ అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే.. భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ఈ చిత్రం ఇప్పటికే 25 మిలియన్ డాలర్లు అంటే 200 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 110 మిలియన్ డాలర్లు అంటే 900 కోట్ల రూపాయల కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉంది.

గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ నటీనటులు: గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 వాల్యూమ్ మూవీలో నటీనటులు విషయానికి వస్తే.. క్రిస్ ప్రాట్, జో సల్తానా, బ్రాడ్లీ కూపర్, విన్ డిజిల్, కారెన్ గిల్లాన్, డేవ్ బాటిస్టా, పామ్ క్లెమెంటీఫ్, విల్ పౌల్టర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జేమ్స్ గున్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు కెవీన్ ఫీజ్ నిర్మాతగా, నికోలాస్ కోర్డా, సారా స్మీత్, సైమన్ హాట్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించారు.


Click it and Unblock the Notifications











