Don't Miss!
- News
రంగంలోకి ప్రధాని మోదీ - షా : తెలంగాణలో త్రిముఖ వ్యూహం..!!
- Finance
fpi: ఇండియన్ మార్కెట్ల నుంచి FPIల నిష్క్రమణ.. ఒక్క నెలలోనే అన్ని కోట్లా ??
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Gully Rowdy Pre Release business: రిలీజ్‌కు ముందే రికార్డు లాభం.. ఎంత ప్రాఫిట్ అంటే?
టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్, హీరోయిన్ నేహా శెట్టి జంటగా నటించిన గల్లీ రౌడీ చిత్రం ప్రమోషన్స్ కార్యక్రమాలతో అంచనాలు పెంచింది. ఏవీవీ సినిమా, కోనా ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంవీవీ సత్యనారాయణ నిర్మాతగా, జీ నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్, ప్రీ రిలీజ్ బిజినెస్ అంశాలు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివారాల్లోకి వెళితే.,.
గల్లీ రౌడీ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ రంగంలో రూపొందింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఆ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ చేయించారు. చిత్ర యూనిట్‌కు మంచి సక్సెస్ లభించాలని చిరంజీవి ఆకాంక్షించారు. ఈ ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో యూనిట్ మంచి జోష్ మీద కనిపించింది.
ట్రైలర్ రిలీజ్ సందర్భంగా సందీప్ కిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిరంజీవి బొమ్మతోపాటు బాస్ అనే అక్షరాలు ముద్రించి ఉన్న షర్ట్‌ను వేసుకొని మెగాస్టార్ వద్దకు వెళ్లారు. సందీప్ కిషన్ షర్ట్ చూసి చిరంజీవి థ్రిల్ అయ్యారు.
ఇక గల్లీ రౌడీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ చిత్రాన్ని రూ.10 కోట్ల మేర వెచ్చించి తెరకెక్కించారు. అయితే ఈ సినిమాపై భారీ బజ్ ఏర్పడటంతో బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను రూ.4 కోట్లకు అమ్ముడు కాగా, శాటిలైట్ హక్కులకు రూ.2.25 కోట్లు వచ్చాయి. అలాగే ఓటీటీ రైట్స్ సుమారు రూ.3.25 కోట్లకు అమ్ముడుపోయాయి.

ఇక తమిళ, మలయాళ, కన్నడ భాషల థియేట్రికల్ హక్కులు మరో 2 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దాంతో ఓవరాల్‌గా ఈ చిత్రం రిలీజ్‌కు ముందే రూ.5 కోట్ల మేర లాభం వచ్చిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో రిలీజ్‌కు ముందే ఈ రేంజ్‌లో లాభాలను గడించడం సందీప్ కిషన్‌కే చెందిందని అంటున్నారు.
నటీనటులు:
సందీప్
కిషన్,
నేహా
శెట్టి,
బాబీ
సింహా,
హర్ష
చెముడు,
వెన్నెల
కిషోర్,
రాజేంద్ర
ప్రసాద్,
పోసాని
కృష్ణ
మురళీ,
షకలక
శంకర్,
మైమ్
గోపి
తదితరులు
స్క్రీన్
ప్లే,
దర్శకత్వం:
జీ
నాగేశ్వర్
రెడ్డి
కథ:
భాను
భోగవరం
రచన:
నందు
సావిరిగన
నిర్మాతలు:
కోన
వెంకట్,
ఎంవీవీ
సత్యనారాయణ
సినిమాటోగ్రఫి:
సుజాత
సిద్ధార్థ్
ఎడిటింగ్:
చోటా
కే
ప్రసాద్
మ్యూజిక్:
రవి
మిర్యాల,
సాయి
కార్తీక్
బ్యానర్:
కోనా
ఫిల్మ్
కార్పోరేషన్,
ఎంవీవీ
సినిమాస్
రిలీజ్
డేట్:
2021-09-17