‘రుద్రమదేవి’ విడుదల ఆ తేదీకే

By Srikanya

హైదరాబాద్ :కాకతీయ వీరనారిగా అనుష్క నటించిన ‘రుద్రమదేవి'ని మే 22 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై రూపొందిందీ చిత్రం. భారతదేశపు తొలి చారిత్రాత్మక స్టీరియోస్కోపిక్‌ త్రీడీ చిత్రమిది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దర్శకుడు గుణశేఖర్‌ మాట్లాడుతూ ‘‘ వసంతపంచమి రోజు వరంగల్లులోని వేయిస్తంభాల గుడిలో ఈ సినిమాను మొదలుపెట్టాం. ఓ మహాయజ్ఞంలా సాగిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. డబ్బింగ్‌, గ్రాఫిక్‌ వర్క్స్‌తో పాటు మిగిలిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులన్నీ జరుగుతున్నాయి.' అని తెలిపారు.

Guna Shekar's Rudramadevi gets release date

అలాగే గుణశేఖర్‌ కంటిన్యూ చేస్తూ... ‘‘ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేందుకు డాల్బీ అట్మాస్‌ 3డిలో రూపొందించాం. ట్రైలర్‌ కేవలం మచ్చుతునక మాత్రమే. రుద్రమదేవి పాత్రను పండించేందుకు అనుష్క ఎంతో కష్టపడింది. వేసవి ప్రథమంలోనే సినిమాను, అనుష్క నటవిశ్వరూపాన్ని చూడొచ్చు'' అని అన్నారు.

అనుష్క మాట్లాడుతూ ‘‘గుణశేఖర్‌గారి ఎన్నో ఏళ్ళ తపన ఈ సినిమా. ఈ కథ పట్ల ఆయనకున్న పాషన్‌, చేసిన హార్డ్‌వర్క్‌ తెరపై కనిపిస్తుంది. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్‌, వీరభద్రుడిగా రానా కీలక పాత్రలు పోషించారు. ఆ పాత్రలు చెయ్యడానికి వారిద్దరూ అంగీకరించడం గొప్ప విషయం. సినిమా రిలీజ్‌ కోసం ఆతురతగా వెయిట్‌ చేస్తున్నాను'' అని అన్నారు.

అల్లు అర్జున్‌ గోనగన్నారెడ్డిగా కీలక పాత్ర పోషించారు. ఇళయరాజా, తోట తరణి, నీతాలుల్లా, శ్రీకర్‌ ప్రసాద్‌, పరుచూరి బ్రదర్స్‌, సీతారామశాసి్త్ర, అజయ్‌ విన్సెంట్‌, పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌ వంటి సాంకేతికనిపుణులు పనిచేస్తున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కె.రాజగోపాల్‌, సమర్పణ: రాగిణీ గుణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X