‘గుండెల్లో గోదారి’ 3డేస్ కలెక్షన్స్
హైదరాబాద్: మంచు లక్ష్మి తాజాగా నిర్మించిన 'గుండెల్లో గోదారి' చిత్రం యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం మంచి ఫలితాలు సాధిస్తోంది. ఆది, తాప్సి, మంచు లక్ష్మి, సందీప్ కిషన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈచిత్రం ఫస్ట్ వీకెండ్ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ వసూలు చేసింది. నిర్మాతగా మంచు లక్ష్మి కెరీర్లోనే ఈచిత్రం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచిందని ట్రేడ్ నింపులు అంటున్నారు.
గుండెల్లో గోదారి చిత్రంపై ముందు నుంచి మంచి అంచనాలున్నాయి. ఈచిత్రం 2012 నవంబర్లోనే విడుదలవ్వాల్సి ఉండగా, అప్పట్లో థియేటర్ల సమస్య కారణంగా విడుదలకు నోచుకోలేదు. విభిన్న కథాంశంతో పాటు ఈ సినిమా ప్రోమోలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో ఫస్ట్ వీకెండ్ 75% నుంచి 90% ప్రేక్షకులతో థియేటర్లు నిండిపోయాయి. కొన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి.
కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించిన ఈచిత్రానికి శని, ఆది వారాల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈచిత్రం ఫస్ట్ వీకెండ్ ముగిసే నాటికి వరల్డ్ వైడ్ గా రూ. 15 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన శుక్రవారం రూ. 4.25 కోట్లు, శనివారం రూ. 4.75 కోట్లు, ఆదివారం రూ. 6 కోట్లు వసూలు చేసినట్లు అంచనా.
ప్రస్తుతం బరిలో పెద్ద సినిమాలేమీ లేక పోవడం, కొన్ని సినిమాలు ఉన్నప్పటికీ అవి విడుదలైన చాలా రోజులు కావడం వల్ల ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. 'గుండెల్లో గోదారి' చిత్రంతో పాటు విడుదలైన 'మహంకాళి', 'తెలుగుబ్బాయి' లాంటి చిత్రాల బిజినెస్ ఈ చిత్రం కారణం డల్ అయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications











