అల్లు అర్జున్'బద్రీనాధ్'డెఫిషిట్ లో
బద్రీనాధ్ చిత్రం విడుదలైన చాలా చోట్ల యాభై రోజులు లాగటానకి చాలా డెఫిషిట్ పడుతోందని ట్రేడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.ముఖ్యంగా గుంటూరులో ఆరువారాలకు రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలు సంపాదించింది.పదమూడు సెంటర్లలో ఇక్కడ ఈ చిత్రం ఆడింది.అయితే మొదట్లో కలెక్షన్స్ బాగానే ఉన్నా రాను రాను చప్పబడి పోవటంతో యాభై రోజులు అయ్యేసరికి మూడు లక్షలు డెఫిషిట్ అని తేలింది.అక్కడ ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు రెండు కోట్ల యాభై అయిదు లక్షలకు తీసుకుని హరి పిక్చర్స్ ద్వారా విడుదల చేసారు. కానీ ఆ చిత్రం రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలు మాత్రమే సంపాదించింది.అయితే ఇప్పటికీ దాన్ని అల్లు అరవింద్ ఎగ్రిమెంట్ తో మినిమం రెవిన్యూ వచ్చినా కంటిన్యూ చేస్తున్నారు.దాదాపు నలభై ఐదు లక్షలు లాస్ వచ్చిందని చెప్తున్నారు.అయితే బద్రీనాధ్ హిట్టని ఇప్పటికీ అల్లు అరవింద్ ప్రెస్ మీట్స్ పెట్టి మరీ చెప్తున్నారు.తమన్నా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం ఏఁఅచాలా చోట్ల వందరోజులు ఆడించే ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











