Guntur Kaaram Overseas Collections 24 గంటల్లో గుంటూరు కారం రికార్డు బ్రేక్.. మహేష్ తన రికార్డును తానే!
సూపర్‌స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గుంటూరు కారం. హారిక, హాసిని బ్యానర్‌లో చిన్నబాబు నిర్మించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ ప్రదాన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలతో జోష్ పెంచిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..
Recommended Video

గుంటూరు కారం అటు వివాదాలు, ట్రోల్స్, అభిమానుల ప్రశంసల మధ్య ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి. ఇటీవల కుర్చి మడత పెట్టి అనే పాటకు భారీగా స్పందన వచ్చింది. చాలా మంది ట్రోల్ చేయగా. అభిమానులు మాత్రం రీల్స్‌తో సందడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్‌లో ఘనంగా మొదలైంది.

గుంటూరు కారం సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్‌లో ఘనంగా ప్రారంభమైంది. ముందస్తుగా యూకే, అమెరికా, కెనడాలో బుకింగ్ ఓపెన్ చేయగా భారీ స్పందన కనిపిస్తున్నది. ఇంకా 12 రోజుల వ్యవధి ఉండటంతో మరింతగా కలెక్షన్లు, రికార్డు స్థాయి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.
యూకేలో గుంటూరు కారం మూవీ అడ్వాన్స్ బుకింగ్ భారీగా మొదలవుతుంది. ఈ సినిమా బుకింగ్ 31 లోకేషన్ల బుకింగ్ ఓపెన్ అయింది. దాదాపు 52 షోల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దాదాపు 6000 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో సుమారుగా 40 లక్షల రూపాయలు కలెక్ట్ చేసినట్టు సమాచారం.

అమెరికాలో కూడా గుంటూరు కారం మూవీకి భారీగా అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్నది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి 33 లోకేషన్లలో ముందస్తు బుకింగ్ ప్రారంభించారు. దాదాపు 115 షోలకు అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. జనవరి 3వ తేదీ నుంచి పలు చోట్ల బుకింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, డాలస్‌లోని సినిమార్క్, ఐమాక్స్‌లో రికార్డుస్థాయి బుకింగ్ మొదలైంది. ఈ సినిమాకు సంబంధించి 24 గంటల్లోనే 23K డాలర్లు కలెక్ట చేసింది. గతంలో సర్కారు వారీ పాట రిలీజ్ రోజు ముందు వరకు కేవలం 18K కలెక్షన్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. దీంతో ఈ సినిమా అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











