Guntur kaaram: చరిత్ర సృష్టించిన గుంటూరు కారం.. RRR రికార్డు మటాష్.. టాలీవుడ్‌లో టాప్ మూవీగా!

సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ఆరంభంలోనే హైప్‌ను క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీ ఒకటి. అంతలా ఈ చిత్రం అంచనాలను ఏర్పరచుకుని ఈరోజే గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే 'గుంటూరు కారం' మూవీ టాలీవుడ్‌లో సరికొత్త చరిత్రను సృష్టించింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

రమణ గాడు వచ్చేశాడుగా
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇచ్చాడు.

Guntur kaaram Beats RRR Movie Record In Hyderabad City In Advance Bookings

వరల్డ్ వైడ్‌గా అదే ఊపుతో
ప్రకటన సమయం నుంచే భారీ అంచనాలను ఏర్పరచుకున్న 'గుంటూరు కారం' మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వేల సంఖ్యలో విడుదల చేశారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకుల గోలతో దద్దరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లన్నీ నిండిపోయాయి. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఊపును చూపిస్తోంది.

టాక్‌కు తగ్గట్టే రెస్పాన్స్‌తో
పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన షోలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పడిపోయాయి. ఈ మూవీకి టాక్ కూడా డీసెంట్‌గానే లభించింది. అంతటా దీనికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వచ్చింది. దీంతో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్
ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'గుంటూరు కారం' సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. చాలా ప్రాంతాల్లో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్‌ను మొదలు పెట్టగా.. గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడు అయిపోయాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో సత్తా చాటుతోంది.

హైదరాబాద్‌లో రికార్డుతో
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో సాధారణ రెస్పాన్స్‌ను అందుకుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇది భారీ స్పందనతో దూసుకుపోతోంది. ఇలా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే హైదరాబాద్ నగరంలో మహేశ్ బాబు చిత్రం రూ. 11.20 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

RRR రికార్డు బ్రేక్ చేసేసి
'గుంటూరు కారం' మూవీ హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రమంలోనే గతంలో 'RRR' మూవీ పేరిట ఉన్న రూ. 10.90 కోట్లు రికార్డును బ్రేక్ చేసేసింది. ఈ లిస్టులో ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' రూ. 10.56 కోట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ రికార్డుతో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X