Guntur Kaaram USA Collections: యూఎస్‌లో గుంటూరు కారం రికార్డు.. ఒకరోజు ముందే అన్ని కోట్లతో ఊచకోత
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. అలాంటి వాటిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక ఒకటి. గతంలో వీళ్లిద్దరూ కలిసి చేసిన 'అతడు', 'ఖలేజా' ఏ రేంజ్‌లో ప్రభావాన్ని చూపించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అందుకే ఇప్పుడు ఈ స్టార్లు మరోసారి కలిసి 'గుంటూరు కారం' అనే సినిమాను చేస్తున్నారు. భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ తాజాగా యూఎస్‌లో అదిరిపోయే రికార్డును నమోదు చేసుకుంది. ఆ సంగతులేంటో మీరే చూడండి మరి!

పక్కా కమర్షియల్ మూవీగా: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన సినిమానే 'గుంటూరు కారం'. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా నటించారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. ఇక, ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా హవానే: మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలను కూడా విడుదల చేసింది. అదే సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ హవానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు.

అక్కడ RRR రేంజ్ రిలీజ్: క్రేజీ కాంబోలో రాబోతున్న 'గుంటూరు కారం' మూవీ రిలీజ్ జనవరి 12వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఎప్పుడో మొదలయ్యాయి. అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ముఖ్యంగా జనవరి 11న ఈ సినిమాకు సంబంధించి 5408 ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. తద్వారా RRR సినిమా రికార్డును ఇది సమం చేసింది.

మిలియన్ మార్క్ కొట్టాడు: త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేశ్ నటించిన 'గుంటూరు కారం' మూవీకి సంబంధించి యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ భారీ స్థాయిలోనే సాగుతున్నాయి. ఫలితంగా అక్కడ వేల సంఖ్యలో టికెట్లు కూడా అమ్ముడుపోయాయి. ఇలా ఈ సినిమా యూఎస్‌లో విడుదలకు ఒకరోజు ముందుగానే 1 Million డాలర్లు అంటే రూ. 8.30 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసి సత్తా చాటుకుంది.

2వ స్థానానికి చేరిన స్టార్: సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందిన 'గుంటూరు కారం' మూవీ యూఎస్‌లో 1 Million డాలర్ల మార్కును దాటేసింది. తద్వారా ఈ ఫీట్ సాధించిన అతడి 2వ సినిమాగా ఇది నిలిచింది. దీంతో టాలీవుడ్‌లో ఎక్కువ సార్లు 1 Million డాలర్లు మార్కును చేరిన హీరోల లిస్టులో మహేశ్ 2వ స్థానానికి చేరాడు. ఇందులో ప్రభాస్ ముందున్నాడు.


Click it and Unblock the Notifications











