Guntur Kaaram USA Collections: యూఎస్ గడ్డపై మహేశ్ మరో రికార్డు.. రెండో హీరోగా సెన్సేషన్
తెలుగు చిత్ర పరిశ్రమలో సంక్రాంతి సీజన్‌కు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ పండుగ సమయంలో సినిమాలు రిలీజ్ చేసేందుకు చాలా మంది పోటీ పడుతుంటారు. అలా ప్రతి ఏడాది చాలా చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
Recommended Video

ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా కొన్ని మూవీలు వచ్చాయి. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' ఒకటి. క్రేజీ కాంబోలో రూపొందిన ఈ చిత్రానికి వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇది యూఎస్‌లో రికార్డు నమోదు చేసింది. ఆ వివరాలను మీరే చూడండి!

కమర్షియల్ స్టోరీతో వచ్చింది: సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన చిత్రమే 'గుంటూరు కారం'. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా నటించారు. అలాగే, ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రల్లో కనిపించారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

అక్కడ భారీ స్థాయిలో రిలీజ్: కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'గుంటూరు కారం' మూవీకి సంబంధించి ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఎప్పుడో మొదలయ్యాయి. అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ముఖ్యంగా జనవరి 11న ఈ సినిమాకు సంబంధించి 5408 ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. తద్వారా RRR సినిమా రికార్డును ఈ సినిమా సమం చేసేసింది.

2 మిలియన్ మార్క్ కొట్టాడు: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి సంబంధించి యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ భారీ స్థాయిలోనే సాగాయి. ఫలితంగా అక్కడ వేల సంఖ్యలో టికెట్లు కూడా అమ్ముడుపోయాయి. ఆ తర్వాత కూడా ఈ చిత్రం భారీగానే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఇలా ఈ సినిమా యూఎస్‌లో అప్పుడే 2 Million డాలర్ల మార్క్ దాటేసింది.

ఐదు సార్లు ఈ మార్క్ దాటి: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన 'గుంటూరు కారం' మూవీ యూఎస్‌లో 2 Million డాలర్ల మార్కును దాటేసింది. తద్వారా ఈ ఫీట్ సాధించిన అతడి 5వ సినిమాగా ఇది నిలిచింది. గతంలో మహేశ్ బాబు కెరీర్‌లో 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను', 'సరిలేరు నీకెవ్వరు', 'సర్కారు వారి పాట' మూవీలు ఈ మార్క్‌ను చేరాయి.

టాలీవుడ్‌లో రెండో హీరోగా: యూఎస్‌లో ఎక్కువ సార్లు 2 Million డాలర్లు మార్కును చేరిన తెలుగు హీరోల లిస్టులో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఐదు సినిమాలతో 2వ స్థానానికి చేరాడు. ఈ జాబితాలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఆరు సినిమాలతో అందరి కంటే ముందున్నాడు. వీళ్ల తర్వాత చిరంజీవి, ఎన్టీఆర్ మూడు సినిమాలతో మూడో స్థానంలో నిలిచారు. పవన్, బన్నీ, చరణ్ రెండు సినిమాలతో తర్వాత ఉన్నారు.


Click it and Unblock the Notifications











