Guntur Kaaram 3 days Collections గుంటూరు కారం 150 కోట్ల కలెక్షన్ల రికార్డు.. 3 రోజు ఎన్ని కోట్ల వసూళ్లంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు, అందాల తారలు శ్రీలీల, మీనాక్షి చౌదరీ, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు నటించిన గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద స్టడీగా కలెక్షన్లు సాధిస్తున్నది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం తొలి రోజు, రెండో రోజు భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా 3 రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..
గుంటూరు కారం సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా గ్లింప్స్, ట్రైలర్లు భారీగా క్రేజ్ పెంచడంతో మొత్తంగా 132 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో వైడ్ రేంజ్‌గా గ్రాండ్‌గా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

గుంటూరు కారం సినిమా 12తేదీన రిలీజ్ అవుతుండగా, కొన్ని గంటల ముందే ఈ సినిమా ప్రీమియర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించారు. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో 1 గంట షోలు భారీగా ప్రదర్శించారు. ఆ షోలు ముగిసిన తర్వాత ఈ సినిమాపై విపరీతంగా నెగిటివ్ టాక్ వినిపించింది. సినిమా రిలీజ్‌కు భారీ ప్రతికూలత ఎదురైంది.
ఊహించని విధంగా నెగిటివ్ టాక్ స్పెడ్ అయినప్పటికీ గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలబడింది. ఈ సినిమాకు రికార్డుస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కావడం కలిసి వచ్చింది. దాంతో తొలి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 94 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

ఇక రెండో రోజు కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. కానీ రెండో రోజు కూడా గౌరవప్రదమైన కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రెండో రోజు 33 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఏపీ, నైజాంలో 8 కోట్ల షేర్, 14 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 11.5 కోట్లు, 19 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 127 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక మూడో రోజు గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద స్టడీగా వసూళ్లను సాధించింది. మూడో రోజు ఈ సినిమా 14 కోట్ల రూపాయలు నికరంగా ఇండియావైడ్‌గా, 20 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 37 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని మూవీ యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని దాటడమే కాకుండా మూడు రోజుల్లో మొత్తంగా 164 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది.


Click it and Unblock the Notifications











