Guntur Kaaram Advance Collections: యూఎస్‌లో రికార్డు.. గుంటూరు కారం మూవీకీ ఓవర్సీస్‌లో ఎన్ని కోట్లంటే?

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హారిక హాసిని బ్యానర్‌పై సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో చినబాబు నిర్మిస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. కొన్ని వివాదాలు, కొన్ని సానుకూలతల మధ్య భారీగా బజ్ కూడా క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన కనిపిస్తున్నది. ఈ అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..

గుంటూరు కారం సినిమాకు ఓవర్సీస్‌లో భారీగా కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబడుతున్నది. ఇప్పటికే యూకే, అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ కావడంతోపాటు భారీగా వసూళ్లను నమోదు చేస్తున్నది. ఇంకా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా బుకింగ్స్ ఒపెన్ కావాల్సి ఉంది. ఇండియాలో కూడా ఇంకా బుకింగ్స్ నమోదు కాకపోవడంతో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల విషయంలో క్లారిటీ లేకపోయింది.

Guntur Kaaram Expected Advance Booking Collections Worldwide: Here is Mahesh Babu Movie box office Report

జనవరి 9వ తేదీ వివరాలు

గుంటూరు కారం సినిమా బెంగళూరు అడ్వాన్స్ బుకింగ్ జనవరి 9వ తేదీన కూడా మంచి రెస్సాన్స్ వచ్చింది. మొత్తం 185 షోలకు గాను.. 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. 31 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

యునైటెడ్ కింగ్ డమ్‌లో ముందస్తు బుకింగ్ రెస్పాన్స్ పర్వాలేదనిపిస్తున్నది. 94 లోకేషన్లలో 151 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 13600 టికెట్లు అమ్ముడుపోయాయి.

జనవరి 8వ తేదీన

ఇండియాలో గుంటూరు కారం సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే.. కేవలం బెంగళూరులో ఓపెన్ చేశారు. బెంగళూరులో 130 షోలకు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా.. ఇప్పటి వరకు 30 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ముందస్తు బుకింగ్ ద్వారా ఇప్పటికే ఈ సినిమా 50 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

యూకేలో గుంటూరుకారం సినిమాకు మంచి స్పందన లభిస్తున్నది. ఈ మూవీని ప్రదర్శించేందుకు 94 లోకేషన్లలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దాదాపు 150 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 13000 టికెట్లు అమ్ముడుపోయాయి.

Guntur Kaaram Expected Advance Booking Collections Worldwide: Here is Mahesh Babu Movie box office Report

ఉత్తర అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌ హై రేంజ్‌లో కొనసాగుతున్నది. ఈ సినిమాను 400 లోకేషన్లలో స్క్రీనింగ్ చేసేందుకు ప్లాన్ చేశారు. దాదాపు 1250 షోలు ప్రదర్శించేందుకు బుకింగ్స్ ఓపెన్ చేశారు. నార్త్ అమెరికాలో ఈ సినిమా 900K కలెక్షన్లను రాబట్టింది. త్వరలోనే ఈ మూవీ యూఎస్, కెనడాలో 1 మిలియన్ మార్క్‌ను చేరుకోనున్నది.

ఇదిలా ఉండగా, గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గుంటూరు పట్టణంలో నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈవెంట్ ముగిసిన తర్వాత మరింత బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభిస్తే.. బాక్సాఫీస్ నంబర్స్ భారీగా ఉండే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X