Guntur Kaaram Box Office Collections 100 కోట్ల క్లబ్‌లో గుంటూరు కారం.. మహేష్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హరికా హసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్య దేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మాణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన సినిమా గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ క్రేజ్ మధ్య జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, స్క్రీన్ల కేటాయింపు, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
గుంటూరు కారం సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. స్టార్స్, టెక్సిషియన్స్ రెమ్యూనరేషన్స్, అలాగే ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు సుమారు 200 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. అయితే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 132 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. దాదాపు 135 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది.

గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. 42 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 14 కోట్లు, ఆంధ్రాలో 46 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 102 కోట్ల మేర బిజినెస్ నమోదు చేసుకొన్నది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 9 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 20 కోట్ల రూపాయలకు రైట్స్ అమ్ముడుపోయాయి.
ఇక గుంటూరు కారం సినిమాకు భారీ క్రేజ్, బజ్ క్రియేట్ కావడంతో రికార్డు స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఆంధ్రా, నైజాంలో 1050 స్క్రీన్లు, ఇండియా వైడ్‌గా ఇతర రాష్ట్రాల 150 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో 850 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

గుంటూరు కారం సినిమాకు క్రేజీగా అడ్వాన్స్ బుకింగ్‌తోపాటు భారీగా ఆక్యుపెన్సీ కూడా నమోదు అయింది. మార్నింగ్ షోలకు 75 శాతం, మ్యాట్నికి 60 శాతం, ఫస్ట్ షోకు 70 శాతం, సెకండ్ షోకు 70 శాతం నమోదైంది. అత్యధికంగా హైదరాబాద్‌లో 70 శాతం, విజయవాడలో 97 శఆతం, వైజాగ్‌లో 90 శాతం, వరంగల్‌లో 77 శాతం, కాకినాడలో 90 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.
గుంటూరు కారం సినిమా తొలి రోజు కలెక్షన్లు
మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా తొలి రోజున రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 94 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.ఏపీ, నైజాంలో 32 కోట్లు షేర్, 46 కోట్ల గ్రాస్ నమోదు చేసింది. ఇండియావైడ్‌గా 41 కోట్ల గ్రాస్, 74 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 20 కోట్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా 94 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
100 కోట్ల క్లబ్‌లో మహేష్ బాబు మూవీ
2వ రోజు గుంటూరు కారం వసూళ్లు
గుంటూరు కారం సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల షేర్, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో 14 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. గత రెండు రోజుల్లో ఈ సినిమా 63 కోట్ల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ బిజినెస్‌లో 48 శాతం రికవరీని సాధించింది.
3వ రోజు గుంటూరు కారం కలెక్షన్లు
మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా మూడో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా ఉంది. ఈ సినిమా 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 2 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 3వ రోజు 13 కోట్ల షేర్ వసూలు చేస్తుందని తెలిపారు. దాంతో ఈ సినిమా 125 కోట్ల మేర వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











