Guntur Kaaram Advance Booking గుంటూరు కారం రికార్డు ఓపెనింగ్స్.. రిలీజ్‌కు ముందే ఎన్ని కోట్లంటే?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరోగా హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు నిర్మించిన చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రంలో మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించారు. ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..
గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని సుమారుగా 75 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడటంతో రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమాకు ఇండియాలోను, తెలుగు రాష్ట్రాల్లోను, అలాగే ఓవర్సీస్‌లోను భారీగా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు నమోదు అవుతున్నాయి.

ఓవర్సీస్ మార్కెట్‌లో గుంటూరు కారం సినిమాకు గ్రాండ్ ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి. ఈ సినిమాకు ఇప్పటికే 1.5 మిలియన్ డాల్లరు అంటే ఇండియా కరెన్సీలో 12.45 కోట్ల రూపాయలు నమోదు అయ్యాయి. ప్రీమియర్స్, డే 1 కలెక్షన్లు కలిపితే 4 మిలియన్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇక కర్ణాటకలో కూడా అడ్వాన్స్ బుకింగ్ భారీగా ప్రారంభమైంది. ఈ సినిమా బెంగళూరులో గ్రాండ్‌గా కలెక్షన్లు సాధిస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం 1.6 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తమిళనాడు, హిందీ ప్రాంతాల్లో తాజాగా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం మధ్యాహ్నం గుంటూరు కారం అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలవ్వగానే హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడు పోతున్నాయి. హైదరాబాద్‌లో 6 కోట్ల రూపాయల కలెక్షన్లు, తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల రూపాయల కలెక్షన్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబడుతున్నది.

గుంటూరు కారం సినిమా ఇండియా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. ఇప్పటికే ఈ చిత్రం 12 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 12 కోట్లకుపైగా ఓవర్సీస్ వసూళ్లతో కలిపి 25 కోట్ల రూపాయలు వసూలు చేసిందని పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











