Guntur kaaram: సినిమా అడ్డాలో మహేశ్ బాబు ఆల్‌టైం రికార్డు.. RRRను దాటేసిన గుంటూరు కారం

గుంటూరు కారం.. గుంటూరు కారం.. గుంటూరు కారం.. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతోన్న సినిమాల్లో ఇది ఒకటి. అంతలా ఈ మూవీ ఆరంభంలోనే హైప్‌ను క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత దీన్ని రెట్టింపు చేసుకుంటూ ఎన్నో అంచనాలతో శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే, ఈ చిత్రానికి అనుకున్న విధంగా పాజిటివ్ టాక్ అయితే రాలేదు. కానీ, రెస్పాన్స్ మాత్రం ఫస్ట్ డే భారీగా లభించింది. ఈ నేపథ్యంలో 'గుంటూరు కారం' మూవీ సినిమా అడ్డాలో ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. ఆ వివరాలేంటో మీరే చూసేయండి మరి!

Guntur kaaram Movie Creates All Time Record at RTC Cross Road

గుంటూరు ఘాటుతో మహేశ్: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా సినిమానే 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రల్లో నటించారు.

Guntur kaaram Movie Creates All Time Record at RTC Cross Road

టాక్‌తో సంబంధం లేకుండా: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, దీనికి సంబంధం లేకుండా రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. మరీ ముఖ్యంగా మొదటి రోజు ఫస్ట్ అండ్ సెకెండ్ షోకు మాత్రం అత్యధిక స్పందన దక్కింది.

Guntur kaaram Movie Creates All Time Record at RTC Cross Road

ఒక్క రోజులోనే అన్ని కోట్లతో: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా స్పందన భారీగా దక్కడంతో కలెక్షన్లు కూడా అదే రీతిలో పోటెత్తాయి. దీంతో ఈ సినిమా మొదటి రోజే దాదాపు రూ. 40 కోట్లు షేర్‌తో పాటు 70 కోట్లు గ్రాస్ మార్కును చేరుకుంది. తద్వారా మహేశ్ బాబు కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌తో సంచలన రికార్డు నమోదు చేసింది.

Guntur kaaram Movie Creates All Time Record at RTC Cross Road

హైదరాబాద్‌లో భారీ షోలు: 'గుంటూరు కారం' మూవీ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదలైంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఇది ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అంతేకాదు, హైదరాబాద్‌లో ఈ చిత్రానికి స్పెషల్ షోలతో కలిపి మొత్తంగా ఆరు పడ్డాయి. ఇలా ఒక్క నగరంలోనే ఈ చిత్రం వేయికి పైగా షోలు ప్రదర్శితం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన కొద్ది చిత్రాల్లో స్థానం సాధించింది.

Guntur kaaram Movie Creates All Time Record at RTC Cross Road

క్రాస్ రోడ్స్‌లో సంచలనంగా: నైజాం ఏరియాలో అత్యంత ముఖ్యమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో 'గుంటూరు కారం' మొదటి రోజే భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ఈ మూవీ ఏకంగా రూ. 81.61 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసి సత్తా చాటింది. ఈ క్రమంలోనే 'RRR' మూవీ పేరిట ఉన్న రూ. 75.85 లక్షల రికార్డును ఇది బ్రేక్ చేసేసి ఆల్‌టైం టాప్ మూవీగా ఘనతను సొంతం చేసుకుంది.

Guntur kaaram Movie Creates All Time Record at RTC Cross Road

ఆ తర్వాత స్థానాల్లో ఇవే: సినిమా అడ్డాగా పేరొందిన ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో 'గుంటూరు కారం' మూవీ టాప్ ప్లేస్‌కు చేరుకోగా.. RRR రూ. 75.85 లక్షలతో రెండో స్థానానికి పడిపోయింది. అలాగే, ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ రూ. 57 లక్షలతో నాలుగో స్థానంలో, 'సర్కారు వారి పాట' రూ. 54.23 లక్షలతో ఐదో స్థానంలో నిలిచాయి. ఈ టాప్ 5 సినిమాల్లో మహేశ్ బాబువే రెండు ఉండడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X