Guntur Kaaram Overseas Collections UK,USAలో అడ్వాన్స్ బుకింగ్ రచ్చ..ఆ థియేటర్‌లో హాట్ కేకుల్లా టికెట్ల అమ్మకం
సూపర్‌స్టార్ మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరీ జంటగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హారిక, హాసిని క్రియేషన్స్ నిర్మించిన చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, గ్లింప్స్ మంచి క్రేజ్‌తోపాటు కాంట్రవర్సీకి కేంద్ర బిందువుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మొదలైన గుంటూరు కారం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..
గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లేటుగా అయినప్పటికీ.. మంచి జోష్‌తో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రిలీజైన ధమ్ మసాలా, ఓ మై బేబీ పాటలకు మంచి రెస్సాన్స్ లభించింది. తాజాగా విడుదలైన కుర్చి మడతపెట్టి సాంగ్ రకరకాల స్పందన వ్యక్తమవుతున్నది. ఇా పాజిటివ్, నెగిటివ్ కాంబినేషన్‌లో అడ్వాన్స్ బుకింగ్‌ను మొదలుపెట్టారు.

అమెరికాలో గుంటూరు కారం సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ క్రేజ్ కనిపిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించి 28 లోకేషన్లలో 90 షోలకు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. అయితే డల్లాస్‌లోని సినిమార్క్ థియేటర్‌లో తొలి రోజు సుమారుగా 600 టికెట్లు అమ్ముడుపోవడం ఈ సినిమా క్రేజ్ ఏంటో తెలియజెప్పింది.

అమెరికాలో గుంటూరు కారం బుకింగ్ తొలిరోజే భారీ స్పందన కనిపించింది. ఇప్పటి వరకు 90 షోల కోసం 21K డాలర్లు వసూళ్లు రాబట్టింది. అంటే భారతీయ కరెన్సీలో 17.5 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా రిలీజ్‌కు 14 రోజుల వ్యవధి ఉండటంతో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదయ్యే అవకాశం ఉంది.
ఇక యూకేలో కూడా మహేష్ బాబు సినిమాకు క్రేజీగా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. గుంటూరు కారం సినిమాకు 31 లోకేషన్లలో బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇప్పటి వరకు మొత్తంగా 47 షోలకు అనుమతి తీసుకొన్నారు. తాజా సమాచారం ప్రకారం.. 5500 టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు 20 లక్షల రూపాయలు వసూలు అయినట్టు తెలుస్తున్నది.

ఇంకా ఓవర్సీస్‌లోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాలేదు. త్వరలోనే ఈ సినిమా బుకింగ్స్ తెరిచేందుకు రెడీ అవుతున్నారు. అన్ని ప్రాంతాల్లో బుకింగ్ మొదలైతే భారీ కలెక్షన్లు సాధించే అవకాశం లేకపోలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











