Guntur Kaaram Day 5 Collections 200 కోట్లకు చేరువగా గుంటూరు కారం.. 5వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లటే?

తెలుగు సినిమా పరిశ్రమలో ఆల్ టైమ్ ఫేవరేట్స్‌గా నిలిచిన అతడు, ఖలేజా సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం గుంటూరు కారం. హరికా హాసిని బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గత 5 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Recommended Video

Guntur Kaaram Collections 200 కోట్లకు చేరువగా గుంటూరు కారం..| Mahesh Babu | Telugu Filmibeat

గుంటూరు కారం సినిమాపై గతంలో ఎన్నడూ మహేష్ బాబు సినిమాలపై లేని విధంగా భారీ నెగిటివ్ టాక్‌తో కనిపించింది. డిజాస్టర్, ఫ్లాప్ అంటూ పలు సినిమాలతో పోలికలు పెట్టారు. అయితే అలాంటి నెగిటివ్ టాక్ నుంచి తట్టుకొని తొలి రోజు 94 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

guntur-kaaram-telugu-movie-Boxoffice Reprot

ఆ తర్వాత రెండో రోజు 125 కోట్ల గ్రాస్, మూడో రోజు 164 కోట్ల వసూళ్లను సాధించి ట్రోల్స్, నెగిటివ్ ట్రెండ్ చేసిన వారికి తగిన సమాధానం ఈ సినిమా చెప్పింది. ఫ్యామిలీ ఆడియెన్స్, ఫ్యాన్స్ నుంచి తగిన రెస్పాన్స్ రావడంతో నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది.

గుంటూరు కారం సినిమా నాలుగో రోజు కూడా నిలకడగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా 18 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో ఈ సినిమా 4వ రోజు ముగిసే సమయానికి 182 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది. వీటిలో జీఎస్టీ, ఇతర ట్యాక్పులు కూడా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా, గుంటూరు కారం సినిమా 5వ రోజు కూడా స్ట్రాంగ్ కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల కలెక్షన్లు, ఇండియా వ్యాప్తంగా 1.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 27 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 95 కోట్లు, 193 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

ఇక గుంటూరు కారం మూవీ త్వరలోనే ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించేందుకు రెడీ అవుతున్నది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 132 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటికీ ఈ చిత్రం వరల్డ్ వైడ్ 110 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించింది. ఇదే ఊపు కొనసాగితే త్వరలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం కనబడుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X