Gurram Paapi Reddy Collections: గుర్రం పాపిరెడ్డి కలెక్షన్స్.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
Gurram Paapi Reddy Collections: ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు మంచి ఆదరణ వస్తుంది. అందులో కామెడీ జోనర్ మూవీస్ ను బాగా ఆదరిస్తున్నారు. పైగా విభిన్నమైన కాన్సెప్టులతో వచ్చిన సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. అలా తక్కువ బడ్జెట్ తో కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా గుర్రం పాపిరెడ్డి. ఈ మూవీ డిసెంబర్ 19న విడుదలైంది. భారీ స్టార్ కాస్ట్ లేకపోయినా, వినూత్న కాన్సెప్ట్, డార్క్ కామెడీ టోన్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ కామెడీ క్రైమ్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలా నడుస్తుంది? ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయి? విడుదలైన తొలి మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది? అనే వివరాలు మీ కోసం..
టాలీవుడ్ నటీనటులు నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్ లో నటించిన లేటెస్ట్ మూవీ గుర్రం పాపిరెడ్డి. ఈ మూవీకి మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించారు. డా. సంధ్య గోలి సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మాతలుగా వ్యవహరించారు. హాస్య బ్రహ్మ బ్రహ్మనందం, యోగి బాబు కీలక పాత్రల్లో నటించారు. శవం మార్పిడి చుట్టూ తిరిగే విచిత్రమైన క్రైమ్ ప్లాన్‌తో కథ సాగుతుంది. ఈ సినిమా నటించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్ రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను సుమారుగా 10 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించినట్టు తెలుస్తోంది.

సినిమా కథ విషయానికొస్తే... తెలంగాణ ఖమ్మం జిల్లాకు చెందిన గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య) డబ్బు కోసం చేసిన ఓ తప్పు ప్రయత్నమే కథకు ఆరంభం. బ్యాంక్ చోరీలో విఫలమైన తర్వాత, అతడు సులువైన దారిని ఎంచుకుంటాడు. ఎర్రగడ్డ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసే సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో కలిసి ఒక విచిత్రమైన ప్లాన్ వేస్తాడు. శ్రీశైలంలోని శ్మశానంలో ఉన్న శవాన్ని బయటకు తీసి, మరో సమాధిలో పెట్టాలన్న ఆ ప్లాన్ అనుకోని మలుపులు తిరుగుతుంది. మధ్యలో ఎదురయ్యే సమస్యలు, అవి హీరోను ఎటు తీసుకెళ్లాయి? చివరకు ఆ ప్లాన్ ఫలించిందా లేదా? అన్నదే మిగతా కథ. కామెడీ క్రైమ్ డ్రామా తెరకెక్కిన 'గుర్రం పాపిరెడ్డి' బాక్సాఫీస్ వద్ద మెల్లగా అడుగులు వేస్తోంది. భారీ స్టార్ కాస్ట్ లేకపోయినా, కంటెంట్ ఆధారంగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
ఇక కలెక్షన్ల వివరాలకు వస్తే.. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో పరిమిత వసూళ్లనే నమోదు చేసినప్పటికీ, మిక్స్డ్ టాక్‌తో ముందుకు సాగుతోంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. గుర్రం పాపిరెడ్డి సినిమా తొలి రోజు రూ. 0.19 కోట్ల నెట్ కలెక్షన్ సాధించగా, రెండో రోజు రూ.0.22 కోట్లకు, మూడో రోజు రూ.0.25 కోట్లకు పెరిగింది. ఇలా మూడు రోజుల్లో మొత్తం ఇండియా నెట్ కలెక్షన్ రూ. 0.66 కోట్లకు చేరింది. అదే సమయంలో, ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ సినిమా వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్ సుమారురూ.0.74 కోట్లుగా నమోదైంది. ప్రతి రోజు క్రమంగా వసూళ్లు పెరగడం సినిమా వర్డ్ ఆఫ్ మౌత్ నెమ్మదిగా పాజిటివ్‌గా మారుతున్న సంకేతంగా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, మేకర్స్ విడుదల చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం 'గుర్రం పాపిరెడ్డి' 3 రోజుల్లో రూ.2.25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది అని ప్రకటించారు. సిల్వర్ స్క్రీన్‌పై నిజమైన బ్లాక్‌బస్టర్ నవ్వుల విందు... థియేటర్లలో సంబరాలు కొనసాగుతున్నాయి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. మేకర్స్ మాత్రం థియేటర్ షేర్, అడ్వాన్స్‌లు, కొన్ని ఏరియాల గ్రాస్ కలిపి ప్రకటించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఈ రెండు ఫిగర్స్ మధ్య గ్యాప్ కనిపిస్తోంది.
గుర్రం పాపిరెడ్డి భారీ వసూళ్ల సినిమా కాకపోయినా, కంటెంట్ ఆధారంగా నెమ్మదిగా బజ్ తెచ్చుకుంటున్న చిన్న సినిమాగా చెప్పొచ్చు. మేకర్స్ క్లెయిమ్ చేస్తున్న 3 రోజుల రూ. 2.25 కోట్ల ఫిగర్ చర్చనీయాంశంగా మారినా, ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా ప్రయాణం ఇంకా కొనసాగుతోంది. ట్రేడ్ అంచనాల ప్రకారం.. హాలిడే సీజన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే ఈ సినిమా రూ. 3-5 కోట్ల లైఫ్‌టైమ్ గ్రాస్ వరకు వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలా జరిగితే 'అవరేజ్' లేదా 'సెమీ హిట్' స్థాయిలో నిలవొచ్చని ట్రేడ్ వర్గాల అభిప్రాయం.


Click it and Unblock the Notifications











