Guruvayoor Ambalanadayil Collections ఫృథ్వీరాజ్ సుకుమార్ మూవీకి రికార్డు ఓపెనింగ్స్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే

ప్రముఖ మలయాళ దర్శకుడు విపిన్ దాస్ డైరెక్షన్‌లో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన చిత్రం గురువాయూర్ అంబలనందయిల్. పృథ్వీ రాజ్ ప్రొడక్షన్స్, ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సుప్రియ మీనన్, ముఖేష్ ఆర్ మెహతా, సీవీ సారథి నిర్మించారు. అయితే గోట్ లైఫ్ మూవీ తర్వాత ఈ సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ఏ రేంజ్‌లో కలెక్షన్లు సాధిస్తున్నదనే వివరాల్లోకి వెళితే..

గురువాయూర్ అంబలనందయిల్ చిత్రం ద్వారా తొలిసారి యోగిబాబు మలయాళ సినిమా రంగంలోకి నేరుగా ప్రవేశించారు. ఇంకా ఈ చిత్రంలో అనశ్వర రాజన్, బైజు సంతోష్, రేఖ, ఇర్షాద్ తదతరులు నటించారు. నీరజ్ రేవీ సినిమాటోగ్రఫిని, అంకిత్ మీనన్ మ్యూజిక్, జాన్ కుట్టి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

Guruvayoor Ambalanadayil Expected Box Office Collections Worldwide

పృథ్వీరాజ్ సుకుమారన్ తన చిత్రాన్ని యువ, సీనియర్ నటులతో, అలాగే టాలెంటెడ్ టెక్నిషియన్స్‌తో నిర్మించారు. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవడంతో భారీగా ఖర్చు జరిగింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం గురువాయూర్ అంబలనందయిల్ చిత్రాన్ని సుమారుగా 35 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా మొత్తంగా 40 కోట్ల బడ్జెట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఈ మూవీకి తొలి రోజు బ్రహ్మండమైన ఆదరణ కేరళవ్యాప్తంగా దక్కింది. ఈ సినిమా ఫస్ట్ డే దాదాపు 70 శాతం అక్యుపెన్సీ నమోదు చేసింది. కోచి, త్రివేండ్రం, కోజికోడ్, త్రిచూర్, కోల్లాం, కొట్టాయం, అలెప్పి ప్రదేశాలతోపాటు బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో భారీగా వసూళ్లు సాధించింది. దాంతో ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్‌తో కేరళ బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

Guruvayoor Ambalanadayil Expected Box Office Collections Worldwide

కేరళలో గురువాయూర్ అంబలనందయిల్ చిత్రం కేరళలోనే రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. ఈ చిత్రం సుమారుగా 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 8 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా రెండో రోజు కూడా స్ట్రాంగ్‌గా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది.

Guruvayoor Ambalanadayil Expected Box Office Collections Worldwide

యోగిబాబు మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం రెండో రోజున కూడా అత్యధిక వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాల రిపోర్ట్. ఈ చిత్రం రెండో రోజున కూడా 3 కోట్లకుపైగా కలెక్షన్లను రాబడుతుందని అంచనా. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 6 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల రూపాయల వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X