50 కోట్ల క్లబ్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ.. బాక్సాఫీస్‌ను హడలెత్తిస్తున్న మలయాళ మూవీ!
ప్రముఖ మలయాళ దర్శకుడు విపిన్ దాస్ డైరెక్షన్‌లో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన గురువాయూర్ అంబలనందయిల్ చిత్రం వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నది. పృథ్వీ రాజ్ ప్రొడక్షన్స్, ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సుప్రియ మీనన్, ముఖేష్ ఆర్ మెహతా, సీవీ సారథి నిర్మించారు.మే 16వ తేదీన రిలీజైన ఈ చిత్రంలో యోగిబాబు, అనశ్వర రాజన్, బైజు సంతోష్, రేఖ, ఇర్షాద్ తదతరులు నటించారు. నీరజ్ రేవీ సినిమాటోగ్రఫిని, అంకిత్ మీనన్ మ్యూజిక్, జాన్ కుట్టి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ఏ రేంజ్‌లో కలెక్షన్లు సాధిస్తున్నదనే వివరాల్లోకి వెళితే..
పృథ్వీరాజ్ సుకుమారన్ తన చిత్రాన్ని యువ, సీనియర్ నటులతో, అలాగే టాలెంటెడ్ టెక్నిషియన్స్‌తో నిర్మించారు. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవడంతో భారీగా ఖర్చు జరిగింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం గురువాయూర్ అంబలనందయిల్ చిత్రాన్ని సుమారుగా 35 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా మొత్తంగా 40 కోట్ల బడ్జెట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

గురువాయూరంబల నాదాయిల్ చిత్రం తొలి రోజు నుంచే భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజున సుమారుగా 3.7 కోట్ల రూపాయలను కేరళలో, ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో రోజు కూడా అంతకు మించి అంటే.. కేరళలో 3.8 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 6 కోట్ల రూపాయలు, మొత్తంగా 10.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక మూడో రోజు రికార్డు కలెక్షన్లను నమోదు చేసింది. కేరళలో 6 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక నాలుగో రోజు కూడా అదే జోష్‌ను కొనసాగించి.. కేరళలో 6 కోట్ లరూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 13.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక ఐదో రోజు ఈ చిత్రం 3 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 7 కోట్లు వసూలు చేసింది.

ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇప్పటి వరకు కేరళలో 21 కోట్లు, ఓవర్సీస్‌లో 22 కోట్లు, ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆరో రోజు మరో మూడు కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం మొత్తంగా బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయలు రాబట్టింది.


Click it and Unblock the Notifications











