Kingston Box Office Collections : కింగ్ స్టన్ డే1 కలెక్షన్లు.. జీవీ ప్రకాష్ మొదటి రోజులు ఎన్ని వసూల్ చేశాడంటే?

దక్షిణాదిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న జీవీ ప్రకాష్ కుమార్ తన నటనతోనూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే తమిళంలో పలు చిత్రాల్లో నటించిన ఆయన ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నారు. నటుడిగాను సినిమాలపై తనకున్నఆసక్తికి థియేటర్లలో విజిల్స్ వేయించుకుంటున్నారు. విభిన్న పాత్రల్లో నటించి ప్రశంసలు పొందుతున్నారు. ఈ క్రమంలో జీవీ ప్రకాష్ తాజాగా 'కింగ్ స్టన్' అనే సీ ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

కింగ్ స్టన్.. చిత్రం ఈ రోజు తమిళం, తెలుగుతో పాటు వరల్డ్ లోనూ గ్రాండ్ గా విడుదలైంది. యంగ్ బ్యూటీ దివ్య భారతీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాషే నిర్మాత కావడం విశేషం. అంతే కాదు సంగీత దర్శకుడు కూడా ఆయనే. మరోవైపు హీరోగా ఆయనకిది 25వ చిత్రం కావడం గమనార్హం. అన్ని బాధ్యతల మధ్య జీవీ ప్రకాశ్ 'కింగ్ స్టన్' చిత్రం తెరకెక్కింది. మొదటి రోజు మాత్రం మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

GV Prakash Kumar Divyabharati s Kingston Day 1 Box Office Expected Collections Worldwide

కాగా.. కింగ్ స్టన్ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ఏ మేరకు అందాయనేది ఆసక్తికరంగా మారింది. ట్రేడ్ నిపుణులు పలు రకాలుగా అంచనాలు వేస్తున్నారు. ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ప్రిడిక్షన్ ప్రకారం.. కింగ్ స్టన్ చిత్రం తొలిరోజు ఇండియాలో రూ.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేశారు. అయితే బుక్కింగ్స్ ఓ మాదిగానే ఉండటంతో ఇలా వసూళ్లు వస్తాయని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ ఫిల్మ్ 'డ్రాగన్' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అద్భుతమైన టాక్ ను సొంతం చేసుకోవడంతో ఈ చిత్రానికి కోట్లల్లో వసూళ్లు అందుతున్నాయి. ఈ క్రమంలో పోటీగా 'కింగ్ స్టన్' చిత్రం విడుదలైంది. మొదటి రోజు మాత్రం రూ.5 కోట్ల లోపే వసూళ్ల అందే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు రెండు షోలు మాత్రమే పూర్తయ్యాయి. కాగా ఫస్ట్ షో, సెకండ్ షోకు సంబంధించిన వివరాలతో ఇంకా కలెక్షన్లు పెరుగుతాయా? తగ్గుతాయా అనేది చూడాలి.

GV Prakash Kumar Divyabharati s Kingston Day 1 Box Office Expected Collections Worldwide

Take a Poll

ఇక ఈ చిత్రాన్ని రూ.20 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించారు. ప్యార్లల్ యూనివర్స్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తెరకెక్కించారు. టెక్నీషియన్లు, ఇతర విభాగాల వారు కూడా సినిమాకు నాణ్యమైన వర్క్ ను అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంటోంది. ప్రథమార్థంలో వచ్చిన ట్విస్ట్ ను ద్వితీయార్థంలో దర్శకుడు రివీల్ చేసిన తీరుకు ఆడియెన్స్ థ్రిల్ కావడం ఖాయమన్నారు.

హార్రర్, సస్పెన్స్ కథాంశాలతో తెరకెక్కడంతో సినిమాపై ప్రస్తుతం పాజిటివ్ టాక్ నడుస్తోంది. మరోవైపు సీ ఫాంటసీగా చిత్రీకరించిన సీన్స్, సముద్రంపై యుద్ధ సన్నివేశాలను ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సముద్రంలో అక్రమ వ్యాపారం నేపథ్యంలో కథ సాగడం, అందుకు తగ్గుట్టుగా ట్విస్టులిచ్చే సన్నివేశాలు ఉండటంతో ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. మీడియం బడ్జెట్ లోనే ఈ చిత్రానికి గ్రాండ్ వీఎఫ్ఎక్స్ అందించడం విశేషం. ఇక తమిళ ఇండస్ట్రీలోనే ఇదొక బెస్ట్ అటెంప్ట్ అని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Read more about: gv prakash Kingston tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X