Hai Jawani Toh Ishq Hona Hai Day 1 Collections: హై జవానీ తో ఇష్క్ హోనా హై కలెక్షన్స్.. తొలిరోజు ఎంతంటే?

వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ హై జవానీ తో ఇష్క్ హోనా హై. డేవిడ్ ధావన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. టిప్స్ ఫిల్మ్స్, మ్యాక్సీ మిలియన్ ఫిల్మ్స్ బ్యానర్లపై రమేశశ్ తౌరానీ, గౌరవ్ బోస్ సంయుక్తంగా నిర్మించారు. జూన్ 5వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. హై జవానీ తో ఇష్క్ హోనా హైలో మనీష్ పౌల్, చుంకీ పాండే, జిమ్మి షెర్గిల్, మౌనీ రాయ్ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. యూనస్ సీవాల్ స్క్రీన్ ప్లే, కథను అందించారు. ఫర్హాద్ సామ్జీ సంభాషణలు రాయగా.. అయాంక బోస్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. తనీష్క్ బాగ్చీ సంగీత దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో హై జవానీ తో ఇష్క్ హోనా హై బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..

హై జవానీ తో ఇష్క్ హోనా హై బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీకి 55 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంలే 110 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ముంబై, గోవా, రిషికేశ్‌లతో పాటు ఎడిన్‌బర్గ్, గ్లాస్గో, స్కాట్‌లాండ్ తదితర ప్రాంతాల్లో హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమా చిత్రీకరణ జరుపుకుంది. రిచ్‌నెస్‌తో పాటు సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు.

Hai Jawani Toh Ishq Hona Hai Day 1 Expected Box Office Collections Worldwide Varun Dhawan s film Opening day Report

హై జవానీ తో ఇష్క్ హోనా హై అడ్వాన్స్ బుకింగ్
టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. పూజా హెగ్డే, మృణాల్‌తో వరుణ్ ధావన్ కెమెస్ట్రీ, లిప్‌లాక్ సీన్స్, రొమాంటిక్ కామెడీతో యూత్‌లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బుకింగ్ ఓపెన్ అయిన నాటి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. గురువారం రాత్రి వరకు పీవీఆర్ ఐనాక్స్‌తో పాటు సినీపోలీస్ వంటి మల్టీప్లెక్స్‌లలో దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా టికెట్లు బుక్ అయినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. దాంతో పతీ పత్నీ ఔర్ దో, దే దే ప్యార్ దే 2, భూత్ బంగ్లా, ధురంధర్ 2 తర్వాత హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీ మంచి వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు.

దృశ్యం 3, పెద్దితో పాటు భూత్ బంగ్లా మరికొన్ని సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ హై జవానీ తో ఇష్క్ హోనా హైకి ఓ మోస్తరుగా బుకింగ్స్ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు తొలిరోజు ఈ సినిమాకు ఇండియా వైడ్‌గా 5500 షోలు ప్రదర్శితమై దాదాపు 14 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ పేర్కొంది. ఢిల్లీలో 1049 షోలు, ముంబైలో 579 షోలు, అహ్మదాబాద్‌లో 438 షోలు, సూరత్‌లో 255 షోలు, పూణేలో 238 షోలు, కోల్‌కతాలో 207 షోలు చొప్పున ప్రదర్శితమయ్యాయి.

హై జవానీ తో ఇష్క్ హోనా హై తొలిరోజు వసూళ్లు అంచనా
ఇప్పటి వరకు అందుతున్న సమాచారాన్ని బట్టి హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమాకు తొలిరోజున ఇండియా వైడ్‌గా 3 కోట్ల రూపాయల నెట్.. 3.47 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. తొలిరోజున వరుణ్ ధావన్ మూవీకి ఇండియాలో 6 కోట్ల రూపాయలు, విదేశాల్లో 4 కోట్ల రూపాయలు చొప్పున 10 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా ఎంత వరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X