Devara Rights: రికార్డు ధరకు దేవర ఓవర్సీస్ రైట్స్.. అక్కడ అన్ని కోట్లు వస్తేనే హిట్
టాలీవుడ్‌లో ఇప్పుడు తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే దేశ వ్యాప్తంగా హైప్‌ను క్రియేట్ చేసుకుని హైలైట్ అవుతున్నాయి. అలాంటి చిత్రాల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - బడా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'దేవర' ఒకటి. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయని తెలిసిందే.
కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'దేవర' మూవీని రెండు భాగాలుగా తీస్తున్నారు. అందులో మొదటి భాగాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఇలా ఇప్పటి వరకూ ఎన్నో షెడ్యూళ్లను పూర్తి చేసుకున్నారు. మొత్తంగా 80 శాతం టాకీ పార్టును కంప్లీట్ చేశారు.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'దేవర' మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ బిజినెస్ వర్క్‌ను కూడా మొదలు పెట్టేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్‌ను భారీ డీల్‌కు క్లోజ్ చేసుకుంది. అలాగే, థియేట్రికల్ రైట్స్‌కు సంబంధించిన డీల్స్‌ను కూడా ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటూ వస్తోంది.
సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'దేవర' మూవీకి సంబంధించిన ఓవర్సీస్ డీల్ తాజాగా క్లోజ్ అయినట్లు తెలిసింది. తాజాగా ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్‌ను బడా సంస్థ హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం చిత్ర యూనిట్‌కు సందరు సంస్థ ఏకంగా రూ. 27 కోట్ల రూపాయలు అంటే యూఎస్ కరెన్సీలో 3.3 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది.

ఫిలిం నగర్ ఏరియా సమాచారం ప్రకారం.. 'దేవర' ఓవర్సీస్ రైట్స్ కోసం హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఇచ్చిన మొత్తం ఎన్టీఆర్ సోలో కెరీర్‌లోనే (RRR కాకుండా) టాప్ రికార్డు అని తెలుస్తోంది. ఇక, ఓవర్సీస్‌లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవాలంటే 6.5 మిలియన్ డాలర్లు అంటే రూ. 54 కోట్లు గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా.. డిఫరెంట్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











