105 Minuttess Collections హన్సిక మూవీ హిట్టా? ఫట్టా? 105 మినిట్స్ కలెక్షన్లు ఎంతంటే?

సింగిల్ ఆర్టిస్ట్, సింగిల్ టేక్ కాన్సెప్ట్‌తో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ నటించిన వన్ నాట్ ఫైవ్ (105 Minuttess) మినిట్స్ చిత్రం జనవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. కొత్త నిర్మాత బొమ్మక శివ నిర్మాణంలో రాజు దుస్సా నిర్మించిన ఈ సినిమా ప్రయోగాత్మక చిత్రంగా రూపొందించారు. ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకోవడంతో మంచి క్రేజ్ కనిపించింది. భారీ పోటీ మధ్య రిలీజైన ఈ సినిమా కలెక్షన్లు, బడ్జెట్ గురించిన వివరాల్లోకి వెళితే..

105 Minuttess మూవీ విషయానికి వస్తే.. ఒకే ఇంటిలో ఒకే క్యారెక్టర్‌తో ఈ సినిమాను రూపొందించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రంలో హన్సిక తన పాత్రలో ఒదిగిపోయారు. రకరకాల ఎమోషన్స్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కొత్తదనాన్ని ఆశించే సినీ ప్రియుల కోసం ఈ సినిమాను థ్రియేట్రికల్ రిలీజ్ చేశారు.

Hanisika Motwanis 105 Minuttess Telugu movie Expected box office collection Worldwide

105 Minuttess మూవీని క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా భారీగానే ఖర్చు చేశారు. హన్సిక మోత్వానీ రెమ్యునరేషన్, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని 4 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.

105 Minuttess సినిమా తెలుగు రాష్ట్రాల్లోను, ఓవర్సీస్‌లోను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. నైజాం, ఆంధ్ర, కర్ణాటకలో ఈ సినిమాను సుమారుగా 450 స్క్రీన్లలోను, ఓవర్సీస్‌లో 50 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ మూవీని స్వంతంగా రిలీజ్ చేయడంతో ప్రీ రిలీజ్ బిజినెస్‌ జరగకపోవడంతో 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను వ్యాల్యూ కట్టారు.

Hanisika Motwanis 105 Minuttess Telugu movie Expected box office collection Worldwide

తెలుగు రాష్ట్రాల్లో హన్సికకు ఉన్న ఫాలోయింగ్‌కు తగినట్టుగానే 105 Minuttess సినిమాకు సానుకూలంగా బాక్సాఫీస్ జర్నీ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రోజు 50 లక్షలు, కర్ణాటకలో 10 లక్షలు, ఓవర్సీస్‌లో 10 లక్షల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X