92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రను తిరగ రాసిన హనుమాన్.. అరుదైన, రికార్డు కలెక్షన్లతో సంచలనం!

హనుమాన్ మూవీ 92 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది. సంక్రాంతి బరిలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం స్టార్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టి అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. గత 21 రోజులుగా ఈ చిత్రం హిందీ, తెలుగు, ఓవర్సీస్ రికార్డులను తుడిచిపెడుతున్నది. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషనల్ రికార్డు వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి 2024లో భారీ చిత్రాలు, అగ్ర హీరోలు మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున అక్కినేని లాంటి సినిమాల మధ్య హనుమాన్ చిత్రం వచ్చింది. తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. గత 21 రోజుల్లో ఈ చిత్రం అనేక రికార్డులు నమోదు చేసింది. వర్కింగ్, హాలీడే అనే తేడా లేకుండా కలెక్షన్లను రాబట్టింది.

Hanu Man 22 days Box Office Collections Worldwide: Prashanth Varma movie crossed 300 Crores land Mark

ఇక హనుమాన్ చిత్రం ఉత్దరాదిలో కూడా సంచలన వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం కేవలం హిందీలోనే కాకుండా అన్ని భాషల్లోను ప్రజలు ఆదరించారు. దాంతో ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ రూపాయల కలెక్షన్లు సాధించింది. దాంతో ఈ చిత్రం 92 ఏళ్లలో సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డును తిరగరాసింది.

హనుమాన్ చిత్రం కేవలం స్వదేశంలోనే వసూళ్లు రాబట్టలేదు. విదేశాల్లో కూడా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా కేవలం 20 రోజుల్లోనే ఈ చిత్రం 5 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 59 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇటీవల కాలంలో మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

Hanu Man 22 days Box Office Collections Worldwide: Prashanth Varma movie crossed 300 Crores land Mark

ఇక హనుమాన్ చిత్రం ఇండియాలో 21వ రోజు తెలుగులో 1.13 కోట్లు నికరంగా, హిందీలో 50 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 1.75 కోట్లు రాబట్టింది. ఇక 22వ రోజున కూడా భారీగానే వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 1 కోటి రూపాయలు నికరంగా రెండు కోట్లు గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేశారు. దాంతో ఈ చిత్రం ఇండియాలో మూడు వారాల్లో 180 కోట్ల రూపాయలు నికరంగా కలెక్షన్లు రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 180 కోట్ల రూపాయలకు పైగా, అలాగే 216 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 59 కోట్ల రూపాయలు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్, 150 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X