HanuMan: పరాయి దేశంలో హనుమాన్ ఊచకోత.. టాప్ మూవీగా రికార్డు.. గుంటూరు కారంకు బిగ్ షాక్
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొందరు యంగ్ డైరెక్టర్లు డిఫరెంట్ మూవీలతో మాయ చేస్తున్నారు. తద్వారా విశేషమైన గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో ప్రశాంత్ వర్మ ఒకడు.
వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు తాజాగా 'హనుమాన్' అనే సూపర్ హీరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'హనుమాన్' చిత్రం యూఎస్‌లో అరుదైన రికార్డును నమోదు చేసింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

హనుమాన్ వచ్చేశాడుగా: ప్రశాంత్ వర్మ దర్శత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన సూపర్ హీరో మూవీనే 'హనుమాన్'. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా చేశారు.

అక్కడ భారీగా విడుదల: తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందిన 'హనుమాన్' సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000లకు థియేటర్లకు పైగానే విడుదల చేశారు. దీనికి పోటీ వల్ల తెలుగు రాష్ట్రాల్లో పెద్ద స్క్రీన్లు లభించకున్నా.. హిందీతో పాటు ఓవర్సీస్‌లో అత్యధిక థియేటర్లు సొంతం అయ్యాయి.

పాజిటివ్ టాక్‌తో భారీగా: రియల్ సూపర్ హీరో హనుమంతుడి కథతో రూపొందిన 'హనుమాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీంతో షోలన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయి. ఫలితంగా దీనికి భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులు కూడా బ్రేక్ చేసేసింది.

ప్రీమియర్స్‌కు భారీగానే: క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'హనుమాన్' మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అలాగే, ఓవర్సీస్‌లో సైతం భారీ స్పందన దక్కింది. ఈ నేపథ్యంలో యూఎస్ బాక్సాఫీస్ రిపోర్టు ప్రకారం.. ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారానే 386K డాలర్స్ గ్రాస్ వచ్చింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 3.19 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

మొదటి రోజు ఫుల్‌గానే: ఆంజనేయస్వామి నేపథ్యంతో సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందిన 'హనుమాన్' మూవీకి యూఎస్‌లో మొదటి రోజు భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా ఈ సినిమాకు దాదాపు 502K డాలర్ల కంటే ఎక్కువ వసూలైనట్లు తెలిసింది. దీంతో ప్రీమియర్స్ ప్లస్ మొదటి రోజు కలెక్షన్లు కలిపి అక్కడ 900K డాలర్లు వరకూ రాబట్టింది. అంటే రూ. 7.45 కోట్లు వసూలు చేసింది.

టాప్ మూవీగా రికార్డు: 'హనుమాన్' మూవీ ప్రీమియర్స్‌ను పక్కన పెడితే మొదటి రోజు 502K డాలర్ల కంటే ఎక్కువ రాబట్టింది. దీంతో మీడియం రేంజ్ సినిమాల్లో ఎక్కువ వసూలు చేసిన చిత్రంగా ఇది రికార్డు సాధించింది. ఈ క్రమంలోనే F2 పేరిట ఉన్న 395K రికార్డును బ్రేక్ చేసింది. అలాగే, మొదటి రోజు 'గుంటూరు కారం' వసూళ్లు (390K డాలర్లు) కంటే ఎక్కువ రాబట్టి షాక్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











