HanuMan Collections: తెలుగు గడ్డపై హనుమాన్ రికార్డు.. గంటల్లోనే 108 ఔట్.. యూఎస్‌లో ఎలా ఉందంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన సినిమాలు చేస్తూ.. ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న దర్శకులు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ గాయ్ ప్రశాంత్ వర్మ ఒకడు. 'అ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' వంటి ప్రయోగాత్మక చిత్రాల తర్వాత అతడు తెరకెక్కించిన సినిమానే 'హనుమాన్'. రియల్ సూపర్ మ్యాన్ హనుమంతుడి కథతో రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'హనుమాన్' మూవీ తెలుగు రికార్డు సాధించింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!
హనుమాన్‌గా వస్తున్న తేజ:తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ రూపొందించిన సినిమానే 'హనుమాన్'. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా సందడి:విభిన్నమైన కాన్సెప్టుతో, క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'హనుమాన్' మూవీపై ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని జనవరి 12వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. అందుకోసం చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సందడి ఓ రేంజ్‌లో కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ షోలు:'హనుమాన్' మూవీ జనవరి 12వ తేదీన విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో 11వ తేదీ నుంచే యూఎస్‌లో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి 108 ప్రీమియర్ షోలు ప్రదర్శించబోతున్నారు. అందులో హైదారాబాద్‌లో 37, వైజాగ్‌లో 27, గుంటూరులో 10, నెల్లూరులో 8, రాజమండ్రిలో 4 సహా మొత్తం 108 షోలను ప్లాన్ చేసుకున్నారు.

గంటల్లోనే.. రికార్డ్ నమోదు:'హనుమాన్' మూవీకి సంబంధించి 108 ప్రీమియర్ షోల టికెట్ బుకింగ్స్ ఆన్‌లైన్‌లో పెట్టారు. వీటికి భారీ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా గంటల్లోనే ఈ టికెట్లు అన్నీ అమ్ముడపోయాయి. ఫలితంగా 108 షోలూ సోల్డ్ ఔట్ అయిపోయాయి. దీంతో చిన్న సినిమాగా వచ్చినా ప్రీమియర్స్ త్వరగా అమ్ముడుపోయిన చిత్రంగా 'హనుమాన్' తెలుగులో రికార్డును నమోదు చేసింది.
యూఎస్‌లోనూ భారీగానే:తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న 'హనుమాన్' మూవీకి యూఎస్‌లో కూడా అదిరిపోయే స్పందన వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా ప్రీమియర్స్‌కు అక్కడ 297 లొకేషన్లలో 553 షోలు ప్రదర్శించబోతున్నారు. వీటికి గానూ అప్పుడే 82455 డాలర్లు వసూలు అయ్యాయి. ఇలా ఈ చిత్రం 250K డాలర్లను వసూలు చేసే దిశగా సాగిపోతోంది.


Click it and Unblock the Notifications











