HanuMan 10 days Overseas Collections ఓవర్సీస్‌లో కలెక్షన్ల రచ్చ.. అరుదైన రికార్డుకు చేరువగా హనుమాన్!
తెలుగు రాష్ట్రాలు, దక్షిణాది, ఉత్తరాది, ఓవర్సీస్ అనే తేడా లేకుండా హనుమాన్ చిత్రం బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తున్నది. సంక్రాంతి బరిలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా స్టార్ హీరోల సినిమాలకు మించి కలెక్షన్లను సాధిస్తున్నది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేస్తున్న కలెక్షన్లు సునామీని తలపిస్తున్నాయి. గత 10 రోజులుగా ఓవర్సీస్‌లో ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
హనుమాన్ సినిమాపై రిలీజ్‌కు ముందు పెద్దగా అంచనాలు లేకపోవడం వల్ల బిజినెస్ నామమాత్రంగానే జరిగింది. ఈ సినిమా హక్కులు సుమారుగా 3 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమా నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో సుమారుగా 3.10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది.

యూకే, ఐర్లాండ్ దేశాల్లో హనుమాన్ బాక్సాఫీస్ కలెక్షన్లు ప్రభంజనంలా కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటి వరకు 290K పౌండ్ల వసూళ్లను అంటే 3 కోట్ల రూపాయలు సాధించింది. ఇక ఆస్ట్రేలియాలో ఈ సినిమా 500K ఆస్ట్రేలియన్ డాలర్లను అంటే ఇండియన్ కరెన్సీలో 2.7 కోట్ల రూపాయలు రాబట్టింది.
ఇక న్యూజిలాండ్‌లో కూడా రికార్డు వసూళ్లను సాధించింది. ఈ సినిమి 53 వేల న్యూజిలాండ్ డాలర్లు అంటే 27 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక యూఏఈ, గల్ఫ్ దేశాల్లో 291K డాలర్లు అంటే 2.5 కోట్లు వసూలు చేసింది. ఇక మిగితా దేశాల్లో 1 కోటి రూపాయలు రాబట్టింది.

అదే విధంగా నార్ అమెరికా అంటే.. అమెరికా, కెనడాలో కలిపి హనుమాన్ చిత్రం రికార్డుల తిరగరాస్తున్నది. ఈ సినిమా ఇప్పటికే 4.4 మిలియన్ కలెక్షన్లను వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇప్పటికే 37 కోట్ల రూపాయలు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 5.6 మిలియన్ డాలర్లు అంటే.. 47 కోట్ల రూపాయలు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











