HanuMan Advance Booking బాహుబలి 2 ను బ్రేక్ చేసిన హనుమాన్.. ఎన్ని కోట్ల కలెక్షన్లు అంటే?

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెలుగులో ఫిక్షనల్ మైథాలజీ థ్రిలర్ సినిమాగా తెరకెక్కిన చిత్రం హనుమాన్. యువ హీరో తేజా సజ్జా, అమృతా అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమా వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

హనుమాన్ చిత్రం ప్రీమియర్లకు తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడల్లో భారీగా ప్రీమియర్లు ప్రదర్శించారు. వైజాగ్‌లో బాహుబలి 2 కంటే ఎక్కువగా ప్రీమియర్లు ప్రదర్శించడం విశేషంగా మారింది. ఈ సినిమా ప్రీమియర్లకు భారీ బజ్ క్రియేట్ కావడంతో సినిమాపై మరింత అంచనాలు పెంచింది.

 HanuMan Advance Booking Collections Prediction Worldwide: Baahubali 2 Record broken In Vizag

హనుమాన్ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం థియేట్రికల్ రైట్స్‌ను 7.5 కోట్లు, సీడెడ్ 4 కోట్లు, ఆంధ్రా 10 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో తెలుగు రాష్ట్రాల హక్కులు మొత్తంగా 21.5 కోట్ల మేర అమ్మడం జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులు 2 కోట్ల మేర అమ్ముడుపోయాయి. అలాగే ఓవర్సీస్ రైట్స్ కూడా భారీగా అంటే.. 4 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దాంతో హనుమాన్ సినిమా 27.5 కోట్లుగా నమోదైంది. ఇక ఈ సినిమాకు 28.5 కోట్లు బ్రేక్ ఈవెన్‌గా మారింది.

హనుమాన్ చిత్రం ఓవర్సీస్‌లో మంచి రెస్పాన్స్ కూడగట్టుకొంటున్నది. సుమారు 350 లోకేషన్లలో 560 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ సినిమా 4000 టికెట్లు అమ్మగా, 80000 డాలర్లు అంటే దాదాపు 60 లక్షలకుపైగా వసూళ్లు సాధించింది. యూకే, ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో 200K వసూళ్లు సాధించింది.

ఇక హైదరాబాద్, వైజాగ్ నగరాల్లో హనుమాన్ పెయిడ్ ప్రీమియర్లకు భారీ స్పందన కనిపిస్తున్నది. హైదరాబాద్‌‌లో 120 షోలు ఓపెన్ చేయగా 95 షోలకు హౌజ్‌పుల్ అయ్యాయి అని ట్రేడ్ వర్గాల సమాచారం. దాదాపు 95 శాతం ఆక్యుపెన్సీ నమోదుతో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌, నైజాంలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

తెలుగేతర రాష్ట్రాలో విషయానికి వస్తే.. బెంగళూరులో ఈ సినిమా 20 లక్షలు, కర్ణాటక వ్యాప్తంగా 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో 3.5 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇంకా ఓ రోజు ఉంది కనుక ఇంకా భారీగా కలెక్షన్లు నమోదు చేసింది.

 HanuMan Advance Booking Collections Prediction Worldwide: Baahubali 2 Record broken In Vizag

ఇదిలా ఉండగా, హనుమాన్ సినిమా 60 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సుమారు 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. గురువారం సాయంత్రానికి అడ్వాన్స్ బుకింగ్, పెయిడ్ ప్రీమియర్ కలెక్షన్ల వివరాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X