HanuMan Day 11 Collection హనుమాన్ కలెక్షన్ల కుంభవృష్టి.. 250 కోట్లకు చేరువగా!
ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేస్తున్న హనుమాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబడుతున్నది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజ సజ్జా నటించిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తున్నది. తొలివారంలో ఓ మాదిరి వసూళ్లు సాధించిన ఈ చిత్రం రెండో వారంలో మరింత ఊపును కొనసాగిస్తున్నది. కే నిరంజన్ రెడ్డి నిర్మాతగా రూపొందించిన ఈ సినిమా గత 10 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయి? 11 వ రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందనే విషయంలోకి వెళితే..
హనుమాన్ చిత్రం తొలివారం వసూళ్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 72 కోట్లు నికరంగా, కర్ణాటకలో 12 కోట్లు, తమిళనాడులో 2 కోట్ల రూపాయలు, మలయాళంలో 28 కోట్లు వసూలు చేసింది. ఇక హిందీలో 31 కోట్లు నికరంగా కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా తొలివారం 115 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక హనుమాన్ చిత్రం రెండోవారం కూడా బాక్సాఫీస్ వద్ద బలంగా కనిపించింది. 9వ రోజు తెలుగులో 10 కోట్లు, పదో రోజు 11.5 కోట్లు వసూలు చేసింది. హిందీలో ఈ సినిమా 9వ వ రోజు 5 కోట్లు, 10వ రోజు 6.11 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండోవారం ఇప్పటి వరకు 153 కోట్ల నికరంగా వసూళ్లను సాధించింది.
ఇక హనుమాన్ సినిమా గత 10 రోజుల్లో 202 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో 130 కోట్ల నెట్, 155 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో 5 మిలియన్ డాలర్లు, అమెరికాలో 4 మిలియన్ డాలర్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇప్పటి వరకు 47 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక హనుమాన్ సినిమా 11వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ మూవీ హిందీలో 5.25 కోట్ల రూపాయలు నికరంగా, 10 కోట్ల రూపాయల గ్రాస్, ఇక తెలుగులో 11 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 11వ రోజున 24 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా 250 కోట్ల మార్కుకు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హనుమాన్ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ సుమారు 60 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 28 కోట్లుగా నమోదు అయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 150 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ సినిమా భారీ లాభాలతో కొనసాగుతున్నది.


Click it and Unblock the Notifications











