Hanuman Day 12 Collections బాహుబలి 1 రికార్డుకు చేరువగా హనుమాన్.. ప్రభాస్ రికార్డులపై గురి పెట్టిన తేజా సజ్జా!
ప్రపంచ బాక్సాఫీస్ వద్ద హనుమాన్ చిత్రం కలెక్షన్ల ఊచకోత కొనసాగుతున్నది. వర్కింగ్ డే, హాలీడే అనే తేడా లేకుండా వసూళ్ల కుండపోత కురుస్తున్నది. సంక్రాంతి సినిమా బరిలో దిగిన ఈ సినిమా మిగితా సినిమాలను పక్కకు నెట్టి రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తున్నది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కే నిరంజన్ రెడ్డి నిర్మాతగా తేజ సజ్జా నటించిన ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
హనుమాన్ చిత్రం తొలివారంలో సాధించిన కలెక్షన్లు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 74 కోట్ల రూపాయలు, హిందీలో 25 కోట్ల రూపాయలు, తమిళంలో ఒక కోటి రూపాయలు, కర్ణాటకలో 10 కోట్ల రూపాయలు, మలయాళంలో 2 కోట్ల రూపాయలు వసలూు చేసింది. దాంతో ఈ సినిమా 100 కోట్లు నికరంగా వసూళ్లను సాధించింది.

ఇండియాలో హనుమాన్ చిత్రం 9వ రోజున 15 కోట్లు మేర భారీ వసూళ్లను రాబట్టింది. ఇక 10వ రోజున 18 కోట్ల రూపాయలు, 11వ రోజున 7 కోట్ల రూపాయలు నికరంగా వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 4 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.
హనుమాన్ సినిమా 12వ రోజు మార్నింగ్ షోకు 25 శాతం, మ్యాట్నీకి 35 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఫస్ట్ షోకు 40 శాతం, సెకండ్ షోకు 42 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. దాంతో ఈ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. హైదరాబాద్‌లో 40 శాతం, వరంగల్ 40 శాతం, వైజాగ్‌లో 52 శాతం, మహబూబ్ నగర్‌లో 95 శాతం, కాకినాడలో 70 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.

ఇక హనుమాన్ 12వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా 5 కోట్ల మేర నికరంగా వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 150 కోట్ల రూపాయలు నికరంగా కలెక్షన్లు వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గత 12 రోజుల్లో హనుమాన్ చిత్రం 98 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. హిందీలో 37 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 137 కోట్ల నికరంగా, 163 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాగే ఓవర్సీస్‌లో 47 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 210 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా పలు చోట్ల బాహుబలి 1 రికార్డులకు, అలాగే ప్రభాస్ సినిమా కలెక్షన్ల రికార్డులను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నది.


Click it and Unblock the Notifications











