Hanuman Day 13 Collections బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న హనుమాన్.. 13వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
హనుమాన్ సినిమా కలెక్షన్ల హవా బాక్సాఫీస్ వద్ద జోరుగా కొనసాగుతున్నది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండో వారంలో వర్కింగ్ డే, హాలీడే అనే తేడా లేకుండా వసూళ్లను సాధిస్తున్నది. యువ హీరో తేజా సజ్జా, అమృతా అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు నటించిన ఈ మూవీ ఇప్పటికే కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా 13వ రోజున ఎంత వసూలు చేసింది? గత రెండు వారాల్లో ఈ మూవీ ఎంత కొల్లగొట్టిందనే వివరాల్లోకి వెళితే..
సంక్రాంతి బరిలో దిగిన హనుమాన్ చిత్రానికి స్క్రీన్లు పెద్దగా లభించలేదు. నైజాంలో, ఆంధ్రాలో పరిమితమైన స్క్రీన్లతో ప్రదర్శనలు మొదలుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 450 స్క్రీన్లతో, హిందీలో 1500 స్క్రీన్లతో ప్రపంచవ్యాప్తంగా 2500 స్క్రీన్లలో తొలివారం ప్రదర్శించారు. అయితే మూవీకి ఊహించని టాక్ రావడంతో భారీగా స్క్రీన్లు పెంచారు. ప్రస్తుతం దాదాపు 4500 నుంచి 5000 మధ్య స్క్రీన్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారు.

గత 12 రోజుల్లో హనుమాన్ చిత్రం భారీగా రికార్డు లెవెల్‌లో కలెక్షన్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 101 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 17 కోట్ల రూపాయలు, తమిళనాడులో 3 కోట్ల రూపాయలు, కేరళలో 1 కోటి రూపాయలు, హిందీలో 45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 12 రోజుల్లో 165 కోట్ల నికరంగా కలెక్షన్లను రాబట్టింది.
ఇక 13వ రోజు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. హనుమాన్ చిత్రం పర్వాలేదనే విధంగా ఆక్యుపెన్సీ నమోదు చేసుకొన్నది. మార్నింగ్ షోకు 20 శాతం, మ్యాట్నీకి 23 శాతం, ఫస్ట్ షోకు 30 శాతం, సెకండ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. అత్యధికంగా కాకినాడలో 55 శాతం, మహబూబ్ నగర్‌లో 74 శాతం, వైజాగ్‌లో 45 శాతం, వరంగల్‌లో 35 శాతం, హైదరాబాద్‌లో 30 శాతం ఆక్యుపెన్సీని సాధించింది.

అలాగే 13 కలెక్షన్ల వివరాల్లోకి వస్తే.. ఈ మూవీ ఇండియా వైడ్‌గా సుమారుగా 4 కోట్లు నికరంగా, ప్రపంచవ్యాప్తంగా 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. హిందీలో 1.5 కోట్ల నికరంగా, కర్ణాటకలో 30 లక్షలు, నైజాం, ఆంధ్రాలో కలిపి 3 కోట్లు, తమిళనాడులో 10 లక్షలు, కేరళలో 20 లక్షలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఇంకా భారీగా వసూళ్లను సాధించే కెపాసిటీ కనిపిస్తున్నది.

హానుమాన్ చిత్రం సుమారుగా 65 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓవరాల్‌లో 28 కోట్ల మేర జరిగింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 47 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఇప్పటికీ ఈ సినిమా థియేట్రికల్‌గా 200 శాతానికిపైగా లాభాలను సాధించింది. ఇంకా ఏ రేంజ్ లాభాలను డిస్టిబ్యూటర్లకు పంచి పెడుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











